Ads
తమిళనాడు శివకార్తికేయన్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతూ ఉంటుంది. రెమో సినిమాతో ప్రారంభమై మొన్న వచ్చిన డాన్ మూవీ వరకు కూడా మంచి హిట్లు అందుకున్నారు.
అయితే తాజాగా ఆయన నటించిన ఆలయాన్ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుంది.
తెలుగులో పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నా కూడా డబ్ సినిమాని ఇక్కడ విడుదల చేస్తున్నారు. తమిళ్లో కూడా ఈ మూవీకి పోటీకి ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్, ఐశ్వర్య రజనీకాంత్ లాల్ సలాం మూవీలు వస్తున్నాయి.
అయితే ఆలయాన్ మూవీని 2016 లో అనౌన్స్ చేశారు. అయితే అనౌన్స్ చేసిన ఏడు సంవత్సరాల తర్వాత ఈ మూవీ విడుదల అవ్వడం విశేషం. స్కై – ఫై జోనర్ గా తెరకెక్కడంతో ఈ మూవీ బడ్జెట్ విషయంలో ఇబ్బందులు వచ్చి ఆగుతూ వచ్చిందని శివ కార్తికేయన్ చెప్పారు. దానితో పాటు స్క్రిప్ట్ పైన పలుమార్లు వర్క్ చేసామని, ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉందని చెప్పారు. సినిమా ప్రారంభమయ్యే సమయానికి తన మార్కెట్ ప్రకారం బడ్జెట్ ఎక్కువ అవుతుందని డిలే అయిందని, అలాగే కరోనా కారణంగా కొన్ని రోజులు డిలే అయింది అని చెప్పారు.
Ads
ఇలా ఇప్పటికి పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైనట్లు చెప్పారు. తాజాగా ఈ సినిమాని చూసామని ఈ సినిమా మీద తమకు పూర్తి నమ్మకం ఉందని ఖచ్చితంగా హిట్ అవుతుందని దీనికి సెకండ్ పార్ట్ రూపొందించే ఆలోచన కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఏడేళ్ల నుంచి ఈ సినిమా మేకింగ్ దశలోనే ఉంది కాబట్టి క్వాలిటీ విషయంలోనూ అలాగే స్క్రిప్ట్ విషయంలోనూ కొన్ని కొన్ని వేరియేషన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఆడియన్స్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.
watch trailer :