ఏసీబీ రైడ్స్ జరిగినప్పుడు.. పింక్ రంగులో వుండే ఈ సీసాలని ఎందుకు పెడతారు..?

Ads

లంచం తీసుకోవడం తప్పు అని అందరికీ తెలిసినా చాలామంది ఇంకా అదే తీరు లో వ్యవహరిస్తున్నారు. ఈరోజుల్లో లంచాలు ఇవ్వకపోతే చాలా పనులు అవ్వవు. చాలా పనులు ఆగిపోతాయి. లంచం కచ్చితంగా పలు పనుల కోసం ఇవ్వాలి. డ్రైవింగ్ లైసెన్స్ ని పొందడం మొదలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వరకు లంచాలు కచ్చితంగా ఇవ్వాలి. పెన్షన్ పొందాలంటే కూడా ఈ రోజుల్లో లంచం ఇవ్వాలి.

బాధ్యతలు నిర్వహించడానికి జీతం ఇస్తున్నా కూడా ఆఫీసర్లు లంచం అడుగుతున్నారు. మన పని పూర్తవ్వాలంటే ఖచ్చితంగా లంచం ఇవ్వాలి లేదంటే పని అవ్వదు. అయితే ఇలాంటి లంచగొండులని పట్టుకోవడానికి ఏసీబీ అధికారులు పనిచేస్తారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం తీసుకున్నాడని బాధితుడు ఒక్క మాట చెప్తే చాలు రంగంలోకి దిగిపోతారు.

ACB ఆఫీసర్లు బాధితుడికి కొంచెం అమౌంట్ ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరుగుతుంది. అయితే లంచగొండి ని తీసుకువచ్చిన తర్వాత మీడియా ముందు పెట్టినప్పుడు పింక్ కలర్ లో సీసాలు కనబడతాయి. ఎప్పుడైనా మీరు వీటిని గమనించారా..? ఎందుకు ఈ సీసాలు ఉంటాయి ఈ సీసాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా…? ఎందుకు ఈ సీసాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…

Ads

అధికారులకి ఆ పింక్ సీసాలకి సంబంధం ఉంది ఆ సీసాల కారణంగా అధికారి లంచం తీసుకున్నాడా లేదా అనేది కోర్టులో సాక్ష్యం చెప్పడానికి అవుతుంది. ఇదేంటి సీసాలు సాక్ష్యం చెప్పడం ఏంటని ఆశ్చర్యపోకండి.. అధికారులు ప్రభుత్వాధికారి లంచం తీసుకున్నాడో లేదో తెలుసుకోవడానికి బాధితుడికి కొన్ని కరెన్సీ నోట్లని ఇస్తారు అయితే ఈ నోట్లని పంపేటప్పుడు ఆ నోట్ల మీద ఫినాఫ్తెలిన్ పౌడర్ ని వేస్తారు.

కంటికి ఇది కనిపించదు. కరెన్సీ నోట్ల మీదే కాదు ఏదైనా లాప్టాప్, ఐఫోన్, కెమెరా వంటి వాటిని లంచంగా డిమాండ్ చేస్తే వాటి మీద కూడా ఈ పౌడర్ ని జల్లుతారు. ఆ కరెన్సీ నోట్లనే కానీ ఆయా వస్తువులను లంచగొండి పట్టుకున్నారు అని తెలియగానే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళని పట్టుకుంటారు ఆ టైంలో వాళ్లు సోడియం కార్బోనేట్ ద్రావణాన్ని ఒక సీసాలో వేస్తారు.

లంచగొండిని తన వేళ్ళని ఆ గ్లాసులో పెట్టమని అంటారు. వేళ్ళని పెడితే ఫైనాఫ్తలీన్ పౌడర్ సోడియం కార్బోనేట్ తో కలిసి పింక్ కలర్ లోకి వస్తుంది సోడియం కార్బోనేట్ ఆల్కలైన్ రసాయనం. సోడియం కార్బోనేట్ తో కలిసి పింక్ కలర్ లోకి మారుతాయి. ఈ రసాయని కోర్టులోకి సాక్ష్యంగా తీసుకెళ్తారు ఇలా శిక్ష పడుతుంది.

Previous articleమహేంద్ర సింగ్ ధోని ఆఖరి IPL ఇదేనా..? ఇక క్రికెట్ కి దూరం అయినట్టేనా..?
Next articleపెళ్లి చేసుకునే అమ్మాయి, అబ్బాయి మధ్య ఎంత వయసు తేడా ఉండడం మంచిది..?