Ads
సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ప్రస్తుతం అంతటా ప్రభాస్ ‘ఆదిపురుష్’ మేనియానే కనిపిస్తోంది. నేడు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రీలీజ్ అయ్యింది. తొలి షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ పై పడింది.
Ads
ఆదిపురుష్ మూవీతో పాటు ఓం రౌత్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. దాంతో ఓం రౌత్ ఎవరు? ఎన్ని చిత్రాలు చేశాడు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అని నెటిజెన్లు గూగుల్‌లో తెగ వెతుకుతున్నారు. దర్శకుడు ఓం రౌత్ గురించి ఇప్పుడు చూద్దాం..
దర్శకుడు ఓం రౌత్ ముంబయిలో జన్మించాడు. అక్కడే పెరిగాడు. అతని తల్లి పేరు నీనా, ఆమె బుల్లితెర ప్రొడ్యూసర్. తండ్రి పేరు భరత్ కుమార్, అతను ఒక జర్నలిస్ట్ మరియు ఎంపీ. ఇక ఓం రౌత్ తాతయ్య కూడా సినీ నేపథ్యం ఉన్నవారే కావడంతో ఓం రౌత్ కు చిన్నతనం నుండే సినిమాలంటే ఆసక్తి ఏర్పడింది.
ఓం రౌత్ బాల నటుడిగా ప్రధాన పాత్రలో ‘కారమతి కోట్’ అనే మూవీ చేశాడు. ఆ మూవీలో ఇర్ఫాన్ ఖాన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించాడు. కాలేజీలో చదువుకునే సమయంలో నాటకాల పోటీల్లో పాల్గొనేవాడు. మరాఠీలో ‘లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్’ అనే సినిమాను తెరకెక్కించారు.ఇదే ఆయనకు తొలి సినిమా. ఈ మూవీ అందరి చేత ప్రసంశలు అందుకోవడమే కాకుండా, ఉత్తమ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. తొలి చిత్రంతోనే భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తరువాత తానాజీ అనే పీరియడ్ యాక్షన్ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీకి నేషనల్ అవార్డ్ అందుకున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు టి సిరీస్ సంస్థతో మంచి రిలేషన్ వుంది. దాంతో సాహో, రాధే శ్యామ్ చిత్రాల టైం లో ఆ సంస్థతో ఒక మూవీ చేస్తానని చెప్పారట. అయితే ఓం రౌత్ అప్పటికే ఆ సంస్థలో ఉన్నారు. టీ సిరీస్ ద్వారా ప్రభాస్ కు దర్శకుడు ఓం రౌత్ పరిచయం అయ్యారు. అలా ఆదిపురుష్ మూవీ రూపొందింది. ఓం రౌత్ ఇప్పటి వరకు 3 చిత్రాలు చేశాడు. ఆ చిత్రాలు హిట్ అవడంతో ఆదిపురుష్ మూవీ కూడా మంచి విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read: ప్రభాస్ “ఆదిపురుష్” స్టోరీ, రివ్యూ & రేటింగ్…!