Ads
సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య తెరకెక్కించిన చిత్రం ఖుషి. గీతా గోవిందం తర్వాత సరైన హిట్ లేక సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు…మంచి హిట్ కొట్టి ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్న సమంతకు.. ఈ మూవీ సక్సెస్ ఎంతో ముఖ్యం. అందుకే మూవీ ప్రమోషన్ లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడమే కాకుండా స్టేజ్ మీద ఆక్టివ్ ప్రదర్శనలు కూడా వీరిద్దరూ వెనుకాడ లేదు.
సినిమాని మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియన్ సినిమాగా భారీ స్థాయిలో నిర్మించారు. ప్రేమ కథల స్పెషలిస్ట్ శివ నిర్వాణ దర్శకత్వం చేయడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం తాజాగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ మూవీకి హేషం అబ్దుల్ సంగీతంలో వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు థియేటర్లలో విడుదల అయిన ఈ మూవీ తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది.
Ads
అయితే ఈ సినిమా సాంగ్స్ ప్రోమో విడుదలైనప్పుడే హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి అని అర్ధం అయ్యింది. సినిమా విడుదల అయ్యాక కూడా హీరో-హీరోయిన్ల మధ్య రొమాన్స్ సీన్ పై చాలానే మీమ్స్ వచ్చాయి. అయితే మన సినిమాల్లో కొత్తగా పెళ్ళైన జంట మధ్య ఇలాంటి సన్నివేశాలు సర్వసాధారణమే కదా.? చాలా సినిమాల్లో ఇలాంటి రొమాన్స్ చూసాము కదా.? మరి సమంత-విజయ్ దేవరకొండనే ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు.
సమంత పర్సనల్ లైఫ్ లో విడాకులు తీసుకుంది అని ఇలా టార్గెట్ చేయడం ఏంటి? మూవీ పబ్లిక్ టాక్ లో కూడా కొంతమంది అసభ్యంగా మాట్లాడారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు.? వారి పర్సనల్ విషయాలను పట్టుకొని సినిమాలో సీన్ పై అలా కామెంట్స్ చేయడం కరెక్ట్ అంటారా.? గతంలో విజయ్ దేవరకొండ నటించిన ఎన్నో సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. సమంత నటించిన చిత్రాల్లో కూడా రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. మరి ఈ ఒక్క సినిమా మీదే ఎందుకు అలా కామెంట్ చేస్తున్నారు.?