Ads
సమాజంలో ప్రస్తుతం వేసుకునే బట్టలను బట్టే మనుషులకు విలువ ఇస్తున్నారు. లేనివాడు కాస్ట్లీ బట్టలు వేసుకుంటే ఇచ్చే విలువ వేరు. అదే డబ్బున్నవాడు సాదా బట్టలు వేసుకుని వెళ్తే పట్టిచ్చుకునే విలువ వేరు.
Ads
ఇదంతా ఎందుకు అంటే ఆ విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక సారి అవమానం జరిగింది. ఆయన సినిమాల్లో ఎంత స్టైలిష్ గా కనిపిస్తారో బయట అంత సింపుల్ గా ఉంటారని అందరికి తెలిసిందే. రజినీకాంత్ కి అవమానమే జరిగింది. రజినీకాంత్ నిజ జీవితంలో చాలా సాదాసీదాగా ఉంటారు. ఒక 60 ఏళ్ల తాతగారు ఎలా ఉంటారో, రజినీకాంత్ కూడా అలాగే సింపుల్ గా ఉంటారు. ఆయనలో సూపర్ స్టార్ అనే గర్వం కొంచెం కూడా కనిపించదు.ఆరడుగుల ఎత్తు లేకపోయినా, తెల్లగా అందంగా లేకపోయినా, కండలు పెంచకపోయినా,రజినీకాంత్ భారతీయ సినీ రంగంలో సూపర్ స్టార్ గా మరి అందరినీ ఆశ్చర్యపరిచారు. రజినీకాంత్ నడిచే స్టైల్, డైలాగులు చెప్పే విధానం, పలికించే హావభావాలు ఆడియెన్స్ ను వెండితెరకు కట్టిపడేస్తాయి. బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అని ఆయన చెప్పిన డైలాగ్స్ అంత త్వరగా మర్చిపోలేరు. సినిమాలలో చాలా స్టైలిష్ గా ఉండే సూపర్ స్టార్ రజినీకాంత్. బయట మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు.ఇక అసలు విషయంలోకి వెళ్తే, రజినీకాంత్ ఒకరోజు బెంగళూరులోని ఒక దేవాలయం దగ్గర ఒంటరిగా కూర్చొని, సేద తీరుతుంటే, ఆ టైమ్ లో ఆ గుడికి వచ్చిన ఒక స్త్రీ రజినీకాంత్ వేసుకున్న బట్టలు చూసి, బిచ్చగాడు అని పది రూపాయల నోటుని ఆయన చేతిలో పెట్టి వెళ్ళింది. ఆ తరువాత రజినీకాంత్ వెళ్లేటప్పుడు కారు ఎక్కుతుంటే చూసి షాక్ అయ్యి, బిచ్చగాడికి కారు ఉండటం ఏమిటి అనుకుంటూ ఆయన వైపు చూస్తూ ఉంది.ఆ తరువాత తాను బిచ్చగాడు అని తప్పుగా అర్దం చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ అని తెలుసుకుని, వెంటనే రజినీకాంత్ వద్దకు వచ్చి క్షమించమని అడిగారు. రజనీకాంత్ ఈ సంఘటనను ఎప్పుడూ మర్చిపోలేనని, స్టార్ డమ్, మేకప్ లేకపోతే ఆ గుడి సంఘటన ఎప్పుడూ గుర్తు చేస్తుందని ఆయన అంటుంటారు.
Also Read: పవన్ కళ్యాణ్ కెరీర్‌లో సూపర్ హిట్ అయిన 9 రీమేక్ సినిమాలు ఏమిటో తెలుసా?