Ads
ఆచార్య చాణక్య చెప్పినట్టు మనం జీవితంలో అనుసరిస్తూ ఉంటే జీవితం చాలా బాగుంటుంది. చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో మనకు తెలుసు. ఆయన చెప్పిన నీతి సూత్రాలని, ఆరోగ్య సూత్రాలని చాలా మంది అనుసరిస్తూనే వుంటున్నారు. చాణక్యుడు చెప్పిన విధంగా అనుసరిస్తే ఏ బాధా కూడా ఉండదు. చాణక్య రచించిన అర్థ శాస్త్రం లో ఎంతో జ్ఞానం మిళితమై వుంది. మంచి రచయితగా, సలహాదారునిగా చక్కటి కీర్తిని పొందారు. చాణక్య వీరి మీద మాత్రం అస్సలు దయ చూపించ వద్దని అన్నారు.
మరి ఎలాంటి వాళ్ళ మీద మనం దయ చూపకూడదు అనేది చూద్దాం. ఆచార చాణక్య ఈ ముగ్గురికి అసలు సహాయం చేయొద్దని చెబుతున్నారు. మరి ఎవరెవరికి సహాయం చెయ్యకూడదు అనేది మనం చూద్దాం.
#1. మూర్ఖుడుకి సహాయం చెయ్యద్దు:
మూర్ఖుడు ప్రతీది అహం గానే చూస్తాడు. ప్రతి దాన్ని అహం గానే మూర్ఖుడు తీసుకుంటాడని మంచి మాట్లాడినా అహంగానే భావిస్తాడని చాణక్య అన్నారు.
Ads
#2. అసంతృప్తి, విచారం ఉంటే సహాయం చెయ్యద్దు:
అసంతృప్తి విచారంలో ఉన్న వాళ్ళ పట్ల కూడా దయ చూపడం మంచిది కాదు. అనునిత్యం ఏడుస్తూ ఉండేవాళ్లు అసంతృప్తి విచారంలో ఉండే వాళ్ళకి దూరంగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు ప్రతిదాన్ని కూడా నెగిటివ్ గానే తీసుకుంటారు.
#3. వ్యక్తిత్వం లేని స్త్రీ:
వ్యక్తిత్వం లేని స్త్రీ పట్ల దయగా ఉండడం… ఆమె పట్ల మంచిగా ఉండడం సహాయం చేయడం మంచిది కాదని చాణక్య అంటున్నారు. జీవితంలో వ్యక్తిత్వం లేని స్త్రీ కనబడితే వాళ్లకి దూరంగా ఉండటమే మంచిదని అంటున్నారు. వ్యక్తిత్వం లేని స్త్రీకి కనుక సహాయం చేస్తే అది దుర్వినియోగమే అని చాణక్య చెబుతున్నారు. ఇలాంటి స్త్రీ సమాజానికి విష పురుగు వంటిది. ఇలాంటి స్త్రీకి కేవలం డబ్బు మీద తప్ప మిగిలిన దేని మీద కూడా ఆసక్తి ఉండదని చాణక్య అంటున్నారు. భవిష్యత్తు తరాలకి కూడా ఇటువంటి చెడ్డ లక్షణాలను అలవాటు చేస్తుంది తప్ప మంచి ఇవ్వదని చాణక్య అంటున్నారు.