Ads
ఒకప్పుడు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చేవారేమో. కానీ ప్రస్తుతం మాత్రం స్టార్ హీరోలు తమ నట వారసుడిగా కొడుకులను ,కూతుర్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. మహేష్ బాబు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు…బాలకృష్ణ దగ్గర నుంచి ప్రభాస్ వరకు అందరూ ఇలా ఇండస్ట్రీలోకి వచ్చినవారే. నటసార్వభౌమ విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు నటవరసరిగా అతని కుటుంబం నుంచి ఎందరో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. మరికొందరు సినీ ఇండస్ట్రీ దూరంగా ఉంటున్నారు.
కొందరు సినీ తారలు రాజకీయాలలో కూడా తమ ప్రతిభను చాటుకున్నారు. రామారావు ,ఎంజీఆర్ , జయలలిత, చిరంజీవి, బాల కృష్ణా, పవన్ కళ్యాణ్.. ఇలా ఎందరో సినీ స్టార్స్ రాజకీయాల్ లో తమదైన ముద్ర వేశారు…వేస్తూనే ఉన్నారు. అయితే రాజకీయ దురంధరుడు అయిన చంద్రబాబు.. ఏకైక పుత్ర రత్నం నారా లోకేష్ కేవలం తండ్రీ కి రాజకీయ వారసుడే కాదు …. తాత ఎన్టీఆర్ నటవారసత్వానికి కూడా వారసుడే.
Ads
ప్రస్తుతం రాజకీయాలలో తనదైన చరిత్ర రాయడానికి సర్వ శక్తులా ప్రయత్నిస్తున్న లోకేష్ మొదట సినీ కెరియర్ లో రాణించాలి అనుకున్నారు. నితిన్ హీరోగా వచ్చి రికార్డ్ సృష్టించిన జయం మూవీలో నిజానికి హీరోగా లోకేష్ చేయాల్సిందట. ఆ మూవీ డైరెక్టర్ తేజ .. జయం మూవీకి హీరోగా నారా లోకేష్ ని పరిచయం చేయబోతున్నట్లు ఒక పోస్టర్ ను అప్పట్లో సంతోషం అనే ఒక మేగజైన్ లో ప్రచురించారు కూడా. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఇది కార్యరూపం దాల్చలేకపోవుంది. ఆ తర్వాత లోకేష్ క్రమంగా రాజకీయాల్ లో బిజీ అయిపోయారు.