Ads
అమెరికాలో తెలుగు యువతి కందుల జాహ్నవి పోలీసుల నిర్లక్ష్యం వల్ల మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతి పై యూఎస్ పోలీసులు హేళనగా మాట్లాడిన వీడియోలు వెలుగులోకి రావడం, అవి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎంతోమంది ఈ విషయాన్ని ఖండించారు.
ఆ పోలీస్ ఆఫీసర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ అమెరికాను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. సదరు పోలీసు అధికారి ఆ కామెంట్స్ జాహ్నవిని ఉద్దేశించి చేయలేదని చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుకు చెందిన కందుల జాహ్నవి (23) జనవరి 23న రాత్రి 8 గంటల సమయంలో రోడ్డు దాటుతోంది. అప్పుడే అటు వైపు వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వెహికిల్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తరువాత ఈ కేసు దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీసు ఆఫీసర్ డేనియల్ అడెరెర్, ఆమె గరించి చులకనగా మాట్లాదడమే కాకుండా, నవ్విన వీడియో వెలుగులోకి వచ్చింది. రీసెంట్ గా ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Ads
ఆ పోలీసు ఆఫీసర్ ‘ఆమె ఒక మామూలు వ్యక్తి అని, ఆమె మరణానికి విలువ లేదంటూ మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. భారత్ సీరియస్ అయ్యింది. అతని అపి చర్యలు తీసుకోవాలని అమెరికాను డిమాండ్ చేసింది. ఈ క్రమంలో పోలీసు ఆఫీసర్ డేనియల్ పై దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటన పై డేనియల్ అడెరెర్ తమ ఉన్నతాధికారులకు రాసిన లెటర్ ను సియాటెల్ పోలీసు ఆఫీసర్ల గిల్డ్ రిలీజ్ చేసింది.
అందులో డేనియల్ ‘‘జనవరి 23న పెట్రోలింగ్ వెహికిల్ వల్ల యాక్సిడెంట్ జరిగిందని సమాచారం రావడంతో సాయం చేయడానికి అక్కడికి వెళ్లాను. తిరిగి వస్తుండగా తోటి ఆఫీసర్ కు కాల్ చేసి ఈ ఘటన గురించి తెలిపాను. ఆ సమయానికి తన విధులు పూర్తయ్యాయి. బాడీక్యామ్ కెమెరా ఆన్‌లో ఉన్న సంగతి తెలియదు. నేను మాట్లాడిన వ్యక్తిగత సంభాషణ ఆ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇలాంటి ప్రమాద కేసుల్లో లాయర్లు జరిపే ఎలా వాదిస్తారో మాట్లాడాను.
ఇలాంటి కేసుల్లో మనిషి ప్రాణం విలువ గురించి లాయర్లు ఎలా వాదిస్తారో, ఎలా బేరసారాలు చేస్తారో ఇప్పటికే చాలా సార్లు చూశాను. ఆ వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో జ్ఞాపకం వచ్చి నవ్వుకున్నాను. కానీ అమ్మాయి గురించి కాదు’’ అంటూ లెటర్ లో వివరించారు. సియాటెల్ పోలీసు అధికారుల గిల్డ్ ఈ వివాదంలో డేనియల్ అడెరెర్‌కు సపోర్ట్ గా ఒక ప్రకటన రిలీజ్ చేసింది.