Ads
రవితేజ రాబోయే చిత్రం టైగర్ నాగేశ్వరరావులో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ హేమలతా లవణం క్యారెక్టర్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ క్యారెక్టర్ రేణు దేశాయ్ చేస్తుంది అన్నప్పటి నుంచి అసలు ఈమె ఎవరు అనే సందేహాలు అందరికీ మొదలయ్యాయి. దీంతో హేమలతా లవణం ఎవరు అనేదానిపై ఆన్లైన్లో తెగ సర్చింగ్ చేస్తున్నారు. మరి ఆమె ఎవరో తెలుసుకుందాం పదండి…
హేమలతా లవణం ఒక సమాజ సేవకురాలు.. తెలుగు కవి గుర్రం జాషువా గారి కూతురు. మద్రాసు క్వీన్స్ కళాశాలలో తన బిఏ పూర్తి చేసి బంగారు పతకాన్ని కూడా సాధించారు. తండ్రి లాగే సమాజ సేవ పై దృష్టి సారిస్తూ తన కలానికి పని చెప్పిన గొప్ప వ్యక్తి. వర్ణ భేదాలను అతిక్రమించి…ప్రజాస్వామ్యం, నాస్తికత్వం, గాంధీయవాదం లాంటి విలువలకు కట్టుబడిన గోపరాజు లవణంతో ఆమె వివాహం జరిగింది.
Ads
ఇక ఆమెకు టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి సంబంధం ఏమిటి అంటే…టైగర్ నాగేశ్వరరావు చిత్రం స్టువర్టుపురం నేపథ్యంలో సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు దొంగల కోటగా ఉన్న స్టువర్టుపురం లో చలనం తీసుకురావడంలో హేమలత లవణం పాత్ర ఎంతో ఉంది. ఒకప్పుడు చంబల్ లోయలో వినోబాభావే నేతృత్వంలో బందిపోట్లు లొంగిపోయే ఘట్టాన్ని లవణం దంపతులు స్వయంగా వీక్షించారు.
దాని స్ఫూర్తితోనే సాంఘిక సంస్కరణల సహాయంతో స్టువర్టుపురాని నేర రహిత ప్రదేశంగా మార్చడానికి నడుం బిగించారు. ఆనాటి అటువంటి సంఘసంస్కర్తల కృషితోటే నేరాల గ్రామంగా పేరు పడిన స్టువర్టుపురం ఈరోజు నేరరహిత గ్రామంగా మారింది. అందుకే టైగర్ నావిగేశ్వరరావు చిత్రంలో ఈ పాత్రకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ పాత్ర రేణు దేశాయ్ పోషించడంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది.
ALSO READ : విగ్రహాన్ని స్కాన్ చేసిన శాస్త్రవేత్తలు…అందులో ఉన్నది చూసి అందరు షాక్.! ఇంతకీ ఏముందంటే?