Ads
సుధీర్ బాబు…సక్సెస్ సాధించాలి అని తెగ ప్రయత్నిస్తున్న ఈ ఆక్ట్ ట్రిపుల్ యాక్షన్ మూవీ మామ మశ్చీంద్ర తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ డైరెక్టర్ మన అమృతం సీరియల్ అమృతం అదేనండి హర్షవర్ధన్ వహించాడు. ఇక ఈరోజు విడుదలైన చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించగలిగిందో చూద్దాం..
చిత్రం : మామా మశ్చీంద్ర
నటీనటులు : సుధీర్ బాబు, ఈషా రెబ్బ, మృణాళిని రవి, హర్షవర్ధన్.
నిర్మాత : సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు
దర్శకత్వం : హర్షవర్ధన్
సంగీతం : చైతన్ భరద్వాజ్
విడుదల తేదీ : అక్టోబర్ 6, 2023
స్టోరీ :
పరశురామ్ ( సుధీర్ బాబు) …చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా బంధాలకి ,బంధుత్వాలకి దూరం కావడమే కాకుండా.. సొంత చెల్లిని ఆమె కుటుంబాన్ని కూడా చంపాలి అని అతని మనిషి దాసు (హర్షవర్ధన్) కు చెప్తాడు. అయితే వాళ్లు దాసు చేతుల్లో నుంచి తప్పించుకుంటారు. కొంతకాలం గడిచిన తర్వాత పరశురాం కూతురు విశాలాక్షి ( ఈషా రెబ్బ) ను దుర్గ ( ఇంకొక సుధీర్ బాబు) లవ్ చేస్తాడు.
విశాఖలో దుర్గ ఒక పెద్ద రౌడీ. మరోపక్క హైదరాబాదులో ఉద్యోగం నిమిత్తం ఉంటున్న దాసు కూతురు మీనాక్షి , డీజే (సుధీర్ బాబు) తో ప్రేమలో పడుతుంది. ఈ ఇద్దరి అమ్మాయిల ప్రేమ గురించి తెలుసుకున్న పరశురామ్ అచ్చం తన లాగా ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులను చూసి…తన పోలికలతో ఉన్న మేనల్లుళ్లు అని తెలుసుకుంటాడు. దాంతో నిజంగా వాళ్ళు అమ్మాయిలను ప్రేమించారా ?లేక తన మీద పగ తీర్చుకోవడం కోసం అలా నటిస్తున్నారా అన్న అనుమానం పరశురామ్ కు కలుగుతుంది.
ఇంతకీ పరశురామ్ కు అతని చెల్లెలికి మధ్య వైరం ఏమిటి? పరశురాం అనుమానంలో నిజం ఎంతుంది? పరశురామ్ చెల్లెలు ఆమె భర్త ఏమయ్యారు? గతంలో పరశురామ్ జీవితంలో ఏం జరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే.
Ads
విశ్లేషణ:
దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ… ఇంకా బాగా తీసే స్కోప్ ఉంది. ఒక మీ కుటుంబానికే దూరమయ్యే అంత రాతి మనిషిగా ఎందుకు మారాడు తర్వాత అందరూ ఎలా కలుసుకున్నారు…ఇంతవరకు స్టోరీ బాగుంది టేకింగ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే కంటెంట్ ఇంకా బాగా వచ్చేది. సినిమా స్టోరీ గెస్సింగ్ కి ఈజీగా ఉంటుంది. ఎండింగ్ కూడా ఏమంత ట్విస్ట్ లు లేకుండా చాలా రొటీన్ గా ఉంది. సుధీర్ బాబు మూడు పాత్రలలో చాలా డిఫరెంట్ గా కనిపించాడు కానీ దుర్గ పాత్ర కాస్త ఆడ్ గా ఉంది.
దానికి తోడు పరశురామ్ పాత్రలో సుధీర్ బాబు పెద్దమనుషుల అసలు కనిపించడు ఏదో కుర్ర వ్యక్తికి తెల్ల జుట్టు పెట్టినట్లుగా ఉంటుంది. కనీసం ఆ క్యారెక్టర్ కి డబ్బింగ్ అయినా వేరే వాళ్ళ దగ్గర చెప్పింది ఉంటే బాగుండేది. పాటలు సినిమాకి తగ్గట్టు ఉన్నాయి కానీ పెద్దగా ఆకట్టుకునే విధంగా అయితే లేదు. కొన్ని సీన్స్ లాజిక్కి దూరంగా అస్సలు కన్విన్సింగ్ గా అనిపించదు. మొదటినుంచి పగా..పగా అంటారే తప్ప అసలు మెయిన్ రీజన్ క్లారిటీగా చూపించలేదు.
ప్లస్ పాయింట్స్ :
- ఈ మూవీలో సుధీర్ బాబు త్రిపాత్రాభినయం కొత్తగా ఉంది.
- మంచి నిర్మాణ విలువలను పాటించారు.
- కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి.
- దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ కొత్తగా ఉంది.
మైనస్ పాయింట్స్:
- స్టోరీ రొటీన్ గా తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేసే విధంగా ఉంటుంది.
- సినిమాలు అక్కడక్కడ సీన్స్ కి లాజిక్ లేదు.
- సినిమా అంతా సాగదీసి క్లైమాక్స్ మాత్రం ఏదో హడావిడిగా పూర్తి చేశారు అనిపిస్తుంది.
రేటింగ్ : 2.5/5
ట్యాగ్ లైన్ :
పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఏదో మామూలు సినిమా చూడాలి అనుకుని వెళ్లే వాళ్లకి ఈ మూవీ బాగా సెట్ అవుతుంది.