Ads
ఎప్పుడైనా మీరు గమనించారా..? ఐపీఎస్ లేదా పోలీస్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు చాలా షార్ట్ గా హెయిర్ కట్ చేస్తారు. షార్ట్ గా జుట్టు కట్ చేయడాన్ని సినిమాల్లో కూడా మీరు చాలా సార్లు చూసే వుంటారు. ఐపీఎస్ ట్రైనింగ్ లో కానీ పోలీస్ ట్రైనింగ్ లో కానీ చూస్తే జుట్టుని చిన్నగా కట్ చేస్తారు. ఎందుకు ఇలా చిన్నగా జుట్టుని కట్ చేస్తారు..? ఈ సందేహం మీకు కూడా వచ్చిందా..?
జుట్టుని ఎందుకు చిన్నగా కట్ చేస్తారు..? దీని వెనుక కారణం ఏమిటి అనేది ఈరోజు చూద్దాం. చాలా చిన్నగా జుట్టు ని కత్తిరించడానికి కారణం ఉంది.
Ads
కారణం లేకుండా సరదాగా జుట్టు ని కట్ చేయరు. ఐపీఎస్ లేదా పోలీస్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు ట్రైనింగ్ తీసుకునే వారంతా కూడా ఎంతో కష్ట పడాల్సి ఉంటుంది. ఎన్నో పనులు చేయాల్సినవి ఉంటాయి. ఈ ట్రైనింగ్ లో వాళ్లకి టాస్కులని ఇస్తూ ఉంటారు. తాళ్లు ఎక్కడం, నేలపై పాకడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉంటాయి. ఈ టాస్కుల పైన ఫోకస్ పూర్తిగా పెట్టాల్సి ఉంటుంది. ఎంతో స్ట్రిక్ట్ గా నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే తాళ్లు ఎక్కడం, నేలపై పాకడం మొదలైన కఠినమైన టాస్క్స్ జరిగేటప్పుడు ప్రమాదం కలిగే ఛాన్స్ ఎక్కువ.
అటువంటప్పుడు వారి జుట్టు ముఖం మీద పడడం వలన గాయాలు అయ్యే ప్రమాదం వుంది. సో ఇలాంటివి ఏమి జరగకుండా ఉండేందుకు షార్ట్ గా హెయిర్ కట్ చేస్తారు. ఫ్యాషన్ గా జుట్టుని కట్ చేయడానికి టైం పడుతుంది. అదే చిన్నగా చేసేస్తే స్పీడ్ గా కూడా అయ్యిపోతుంది. అలానే ఈ ట్రైనింగ్ టైం లో అందరూ కూడా యూనిఫామ్ ని వేసుకోవాలి. దీనికి కూడా కారణం వుంది. ట్రైనింగ్ టైం లో కుల, మత, ధనిక, పేద వర్గాల బేధం లేకుండా ఉండాలని యూనిఫామ్ వేసుకుంటారు. ఏది ఏమైనా ఈ ట్రైనింగ్స్ ఈజీ కాదు. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.