అంత మంచి బౌలర్ కి ఏంటి ఈ పరిస్థితి.? రోహిత్ ఇకనైనా మేలుకుంటాడా.?

Ads

వన్ డే వరల్డ్ కప్ లో టీం ఇండియా వరస విజయాలతో దూసుకుపోతుంది. శనివారం చిరకాల ప్రత్యర్థి అయిన పాక్ ను ఓడించి పాయింట్స్ టేబుల్ లో ఒకటవ స్థానంలోకి చేరింది. మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించి టోర్నీలో బోణి కొట్టిన తర్వాత రెండో మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ పై సులభంగా విజయం సాధించింది భారత్. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉంది భారత్. బౌలింగ్, బాటింగ్, ఫీల్డింగ్..ఇలా అన్నిటిలో బలంగా కనిపిస్తుంది టీం ఇండియా.

టీం ఇండియా వరస విజయాలు నమోదు చేసుకొని మంచి ఫార్మ్ లో ఉన్నప్పటికీ బౌలింగ్ లో సిరాజ్ విషయంలో కొంచెం లోపం అనిపిస్తుంది. బాటింగ్ కోసం కూడా అని శ్రదుల్ ఠాకూర్ ని టీం లో తీసుకుంటున్నారు. కానీ అతని బౌలింగ్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోతుంది. బ్యాటింగ్ డెప్త్ కోసం అతడ్ని ఆడిస్తున్నారు. కానీ శార్దూల్ కంటే షమీని ఆడించడం బెస్ట్. పైగా శ్రదుల్ ఠాకూర్ ని ఆడించడానికి టాప్ స్పిన్నర్ అశ్విన్ ని టీం నుండి తొలగిస్తున్నారు. మొదటి స్పెల్ లోనే వికెట్స్ తీయగలడు షమీ. మరి రోహిత్ ఏం నిర్ణయం తీసుకుంటాడో ఎదురు చూడాలి.

టీం ఇండియాకి నెక్స్ట్ పెద్ద సవాలు రానుంది. ఎప్పటిలాగే సెమి ఫైనల్స్ లో న్యూజిలాండ్ లేదా ఇంగ్లాండ్ రూపంలో కాదండోయ్. లీగ్ మ్యాచ్ లోనే బంగ్లాదేశ్ జట్టుతో. బంగ్లాదేశ్ లాంటి చిన్న టీం తో ఇండియాకి సమస్య ఏంటి అనుకుంటున్నారా. ఆసియా కప్ లో ఈ ఒక్క టీం తోనే ఇండియా ఓడిపోయింది. గత కొద్ది కాలంగా బంగ్లాదేశ్ జట్టు నిలకడైన ప్రదర్శన కనబరుస్తుంది.

2017లో వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా గెలుపు ఎంతో కష్టంగా నమోదు అయింది.2022లో బంగ్లాదేశ్ లో భారత్ పర్యటించినప్పుడు వన్డే సిరీస్ చేయి జారిపోయింది. 2022 టి20 ప్రపంచ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో కూడా వెంట్రుక వాసి తేడాతో బంగ్లాదేశ్ పై అతి కష్టం మీద టీమిండియా గెలవగలిగింది. ఆసియా కప్ 2023లో కూడా టీమిండియా బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది.

Ads

అందుకే ప్రస్తుతం జరగబోయే ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ జట్టు వల్ల భారత్ కు పెను ప్రమాదమే పొంచి ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. బలమైన జట్లను అలవోకగా గెలుస్తున్న భారత్.. బంగ్లాదేశ్ చేతిలో మాత్రం ఊహించని విధంగా ఓడిపోతూ వస్తుంది. ఈ గురువారం పుణే వేదికగా ఇండియా బంగ్లాదేశ్ తో తలపడనుంది. మనోళ్లు విజయ యాత్రను కొనసాగిస్తారా లేక బంగ్లాదేశ్ మన గెలుపుకి బ్రేక్ వేస్తుందా అనేది చూడాలి.

బుమ్రా, సిరాజ్ ఫుల్ టైం బౌలర్లు గా ఉన్నారు.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య పై మూడో సీమర్ గా టీం ఇండియా ఎంత వరకు ఆధారపడగలడు. చెపాక్‌లో స్పిన్ కావాలి కాబట్టి అశ్విన్ ని తీసుకున్నారు. తర్వాత రెండు మ్యాచుల్లో పేసర్ కావాలని శ్రదుల్ కి అవకాశం ఇచ్చారు. మరి రానున్న మ్యాచుల్లో అయినా సిరాజ్, శ్రదుల్ లో ఎవరో ఒకరి స్థానంలో షమీకి చోటు ఇస్తారా.?

వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో షమి అద్భుతంగా రాణించాడు. ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్లు కూడా పడగొట్టాడు. గత వరల్డ్ కప్ లో షమీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అలంటి షమీ…ఈ వరల్డ్ కప్ లో మొదటి మూడు మ్యాచుల్లో బెంచ్ కె పరిమితం అవ్వడం ఇండియా క్రికెట్ ఫాన్స్ కి బాధగా ఉంది.షమికే ఇలాంటి పరిస్థితా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా రోహిత్ ప్లాన్ అని మరి కొంతమంది ఫాన్స్ అంటున్నారు. బౌలర్లు ని రొటేట్ చేయడమే ప్లాన్ అంటున్నారు. ప్రస్తుతం టీం బాలన్స్ గా ఉంది కాబట్టి ఇలా కొనసాగిస్తూ…ముందు ముందు కీలక మ్యాచుల్లో షమీ అవసరం ఉంటుంది అని ఇప్పుడు రెస్ట్ ఇస్తున్నారు ఏమో.?

 

Previous articleమెగా ఫ్యామిలీ ఫంక్షన్ ఫోటోలో ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా..? వాస్తవాలు తెలియకుండా ఎందుకు ఇలా రాస్తున్నారు.?
Next article“ప్రవళిక తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తాం..!” అని చెప్పిన మంత్రి కేటీఆర్..! ఏం అన్నారంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.