10000 కి పైగా పాటలు…నేషనల్ అవార్డ్స్..! కానీ చిన్న వయసులోనే మనకి దూరమైన ఈ సింగర్ ఎవరో తెలుసా.?

Ads

సినీ ఇండస్ట్రీలో తమ ప్రతిభతో ఆడియెన్స్ ను అలరించిన చాలామంది నటీనటులు, సింగర్స్ చిన్న వయసులోనే కన్నుమూశారు. అలాంటి వారిలో దివ్య భారతి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, జియాఖాన్ వంటివారు ఉన్నారు. వీరిని ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు.

Ads

వారిలానే సింగర్ స్వర్ణలత కూడా ఇండస్ట్రీలో పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ వంటి భాషలలో 10 వేలకు పైగా పాటలు పాడి, అలరించారు. అయితే స్వర్ణలత చిన్న వయసులోనే కన్నుమూసింది. ఆమె గురించి ఇప్పుడు చూద్దాం..
కేరళలోని పలక్కాడ్ లో చిత్తూర్ అనే గ్రామంలో 1973 ఏప్రిల్ 29న స్వర్ణలత జన్మించింది. ఆమె తండ్రి మలయాళీ కెసి చెరుకుట్టి మరియు ఆమె తల్లి పేరు కళ్యాణి తమిళ్. తండ్రి హార్మోనియం ప్లేయర్,  సింగర్. ఆమె 3 ఏళ్ల వయస్సులో పాడటం ప్రారంభించింది.స్వర్ణలత కర్ణాటక మరియు హిందుస్థానీ సంగీతంలో శిక్షణ పొందారు. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఆమె ఫ్యామిలీ చెన్నైకి వెళ్లింది.
1987లో నీతిక్కు తందానై అనే మూవీలో తొలి అవకాశం వచ్చింది. అలా కెజె ఏసుదాస్‌తో “చిన్నచిరు కిలియే” అనే పాట పాడింది. ఆ తరువాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆమె తన కెరీర్‌లో తెలుగు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, సహా దాదాపు పది భాషలలో 10 వేలకు పైగా పాటలను పాడారు. ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీ సినిమాల్లో పాటలు పాడినప్పటికీ, బాలీవుడ్ లోను స్వర్ణలత గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను ఆలపించారు.
కరుత్తమ్మ సినిమాలోని “పోరాలే పొన్నుతాయి” పాటకు స్వర్ణలతకు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. ఈ సాంగ్ ను సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ స్వరపరిచారు. రెహమాన్ సంగీతంలో నేషనల్ అవార్డ్ ను అందుకున్న తొలి నేపథ్య గాయనిగా స్వర్ణలత నిలిచింది. ఆమె తన అభిమాన సింగర్ అని ఎ.ఆర్.రెహమాన్ పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. స్వర్ణలత 37 ఏళ్ల వయసులో ఇడియోపతిక్ ఊపిరితిత్తుల వ్యాధితోకి చికిత్స తీసుకుంటూ 2010లో సెప్టెంబర్ 12న చెన్నైలోని మలార్ హాస్పటల్ లో కన్నుమూసింది.

Also Read: ఈ 10 మంది హీరో-హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన హీరో-హీరోయిన్లు ఎవరో తెలుసా.?

Previous articleఆర్య సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?
Next articleమలయాళం హీరోలు ఎక్కువగా తెలుగులో ఎందుకు నటిస్తున్నారు..? కారణం ఇదేనా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.