Ads
టీమిండియా వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో వరుస విజయాలతో మంచి ఫామ్ లో దూసుకెళ్తోంది. తాజాగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో సైతం బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. అయితే భారత జట్టుకు షాక్ తగిలింది.
వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో గాయపడిన విషయం తెలిసిందే. పాండ్యా గాయం తీవ్రత మరి ఎక్కువగా ఉండటంతో జట్టుకు దూరం అయ్యాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తదుపరి మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ సేన వైస్ కెప్టెన్ లేకుండానే ఆడనుంది. గురువారం నాడు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ లో ఆడడం లేదని బీసీసీఐ ప్రకటన చేసింది. అయితే వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు భారత జట్టు న్యూజిలాండ్ పై ఒక్క మ్యాచ్ లో కూడా విజయం సాధించలేదు.
Ads
వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఈసారి న్యూజిలాండ్ పై విజయం సాధించాలని భావించింది. కానీ గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడం, కివీస్ పై గెలిచి రికార్డు బ్రేక్ చేయాలనుకున్న టీమిండియాకు ఎదురుదెబ్బే అని అంటున్నారు. కాగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో 9వ ఓవర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. బంతిని ఆపేందుకు ప్రయత్నించిన పాండ్యా కిందపడగా కాలి మడిమకు బలంగా దెబ్బ తాకడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు.
అయినప్పటికీ బౌలింగ్ చేసేందుకు పాండ్యా ప్రయత్నించాడు. నొప్పి ఎక్కువ కావడంతో అతడిని స్కానింగ్ కోసం పంపించారు. స్కానింగ్ రిపోర్టులు వచ్చిన తరువాత పాండ్యాకు కనీసం ఏడు రోజుల విశ్రాంతి ఇవ్వాలని డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్‌తో భారత్ ఆడే మ్యాచ్‌కు పాండ్యా దూరం అయ్యాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా బెంగళూరులోని ఎన్‌సీఏలో చికిత్స పొందుతున్నారు. న్యూజిలాండ్ తో మ్యాచ్ తరువాత టీమిండియా ఇంగ్లండ్‌తో ఆడే మ్యాచ్ కు పాండ్యా అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.
Also Read: వరల్డ్ కప్ లో టీం ఇండియాకి చీర్ చేస్తున్న ఈ “మిస్టరీ గర్ల్” ఎవరో తెలుసా.?