Ads
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన పార్టీ ఎంత క్రియాశీలకంగా పని చేస్తుందో అందరికీ తెలిసిందే. ఆ పార్టీ అధినేత తరువాత ఎక్కువగా వినిపించే పేరు నాదెండ్ల మనోహర్. కీలక నాయకులు ఉన్నప్పటికీ వారి పేర్లు తెరపై ఎక్కువగా కనిపించవు.
అయితే ఇటీవల కాలంలో జనసేనలో ఎక్కువగా వినిపిస్తున్న మరో పేరు రుక్మిణి కోట. కొన్ని రోజుల ముందు వరకు నాదెండ్ల మనోహర్ మాట పార్టీలో సాగేది. అయితే ప్రస్తుతం రుక్మిణి మాట సాగుతోందని, అధినేతను కలవాలంటే రుక్మిణి పర్మిషన్ తప్పనిసరి అని టాక్. రుక్మిణి కోట ఎవరో ఇప్పుడు చూద్దాం..
రీసెంట్ గా రాయలసీమ జిల్లా మహిళా లీడర్ పసుపులేటి పద్మావతి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆమె రాజీనామా లెటర్ లో రుక్మిణి కోట తనను ఎలా ఆడుకుందో వివరించారు. ఈ క్రమంలో రుక్మిణి కోట వార్తల్లో నిలిచింది. పవన్ కళ్యాణ్ తర్వాత జనసేన పార్టీలో వినిపించేది నాదెండ్ల మనోహర్ పేరు. ప్రస్తుతం ఈ లిస్ట్ లో రుక్మిణి కోట అనే మహిళ చేరారు. కొన్ని రోజుల క్రితం వరకు పార్టీలో నాదెండ్ల చెప్పిందే జనసేనలో నడిచేది. అయితే ఇప్పుడు రుక్మిణి కోట చెప్పిందే జరుగుతోందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను కలవడానికి ఆమె పర్మిషన్ ఉండాల్సిందే అనే టాక్ వినిపిస్తోంది.
ఆమె పవన్‌కల్యాణ్ పర్సనల్ మరియు రాజకీయ వ్యవహారాలను చూస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తక్కువ టైమ్ లోనే పార్టీలో ముఖ్యమైన నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రుక్మిణి కోట కృష్ణా జిల్లాకు చెందిన బ్రాహ్మణ మహిళ. ఆమె లండన్‌లో ప్రముఖ బ్రాండెడ్ క్లాత్ స్టోర్ ను నడిపేవారట. జనసేన పార్టీ వీరమహిళల్లో ఒకరిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటనల సందర్భంగా అక్కడ ఆయనకు ఏర్పాట్లు చేసిన రుక్మిణి పార్టీలో కీలక స్థానం పొందింది. ఈ క్రమంలోనే 2020లో జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ చైర్మన్‌గా రుక్మిణిని పవన్ కళ్యాణ్ నియమించారు.
జనసేన పార్టీలో వీరమహిళ అనే టాపిక్ ను తెరమీదకు తీసుకొచ్చిన రుక్మిణి, దిశానిర్దేశం చేస్తోందని పార్టీ వర్గాలు చెబుతుంటారు. ఆమె 2020 నుంచే పార్టీలో ఉన్నా, 2022లో హైదరాబాద్‌కు రావడంతో హైదరాబాద్‌లోని జనసేన ఆఫీస్ బాధ్యతల్ని రుక్మిణికి అప్పగించారు. ఆమె ప్రతిభతో పవన్ కళ్యాణ్ ను మెప్పించడంతో అప్పటి నుండి జనసేనలో కీలకంగా మారిపోయారని తెలుస్తోంది. ఆమె వచ్చిన తరువాత పార్టీ కార్యాలయంలో పనిచేసే ముప్పై మందిని తొలగించేశారని టాక్. వారి ప్లేస్ లో ఆమెకు సంబంధించినవారిని రుక్మిణి తీసుకున్నారని సమాచారం.
Ads
Also Read: రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్లారు…కానీ అక్కడ చేదు అనుభవం.! ఏమైందంటే.?