Ads
ఈ ఏడాది శారద పౌర్ణమి రోజుననే రెండవ చంద్రగ్రహణం ఏర్పడనుంది. అక్టోబర్ 28 శనివారం నాడు రాత్రి చంద్రగ్రహణం ప్రారంభం అవుతుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం ఇండియాలోనూ కనిపించనుంది. ఈ గ్రహణం మొదలవడానికి తొమ్మిది గంటల ముందు సూత కాలం మొదలవుతుంది.
ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి శుభం జరిగితే, మరికొన్ని రాశుల వారికి సమస్యలు, కష్టాలు కలుగనున్నాయి. ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం12 రాశుల వారిపై పడనుంది. ఈ చంద్రగ్రహణం వలన ఏ రాశుల వారికి కష్టాలు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం..
మేష రాశి:
పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం మేష రాశికి చెందిన వారి పై పడనుంది. దాని వల్ల ఫ్యామిలీ మెంబర్ల మధ్య విబేధాలు తలెత్తే అవకాశం ఉంది. అంతే కాకుండా పిల్లలు వారి పేరెంట్స్ తో విబేధించే అవకాశం కూడా ఉంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్ధులు సులభంగా విజయం సాధిస్తారు.
వృషభ రాశి:
చంద్రగ్రహణ ప్రభావం వల్ల వృషభ రాశి చెందినవారు మానసిక ఇబ్బందులు, ఆర్ధిక ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చంచల మనసుతో వీరు తీసుకునే డిసిషన్స్ వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
కర్కాటక రాశి:
Ads
చంద్రగ్రహణం ప్రభావం కర్కాటక రాశికి చెందినవారి పైన పడనుంది. ఆ ప్రభావం వల్ల వీరిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది, దాంతో ఆందోళనకు గురవుతుంటారు. వీరికి సన్నిహితులు, బంధువులతో ఇబ్బందులు ఏర్పడవచ్చు. అందువల్ల ఇతరులతో మాట్లాడే లేదా గడిపే టైమ్ లో సెల్ఫ్ కంట్రోల్ లో ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
సింహ రాశి:
పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం వల్ల సింహా రాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆత్మవిశ్వాసం తగ్గడం వల్ల, వారు చేసే పనులల్లో సమస్యలు ఎదుర్కొవాల్సివస్తుంది. కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఏర్పడడం వల్ల హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉంది. తల్లికావాలని ఎదురు చూసే ఈ రాశి మహిళలు శుభవార్త వినే అవకాశం ఉంది.
Also Read: ఏలినాటి శని అంటే అంటే.? దాని నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి.?