Ads
ప్రస్తుతం భారత్‌లో ప్రైవేట్ ఉద్యోగులు రోజుకి 8 నుండి 9 గంటల వరకు పని చేస్తున్నారు. అయితే కొన్ని ఐటీ కంపెనీలలో రోజుకు పన్నెండు గంటల చొప్పున ఉంటుంది. ఇక వారంలో 2 రోజులు ఆఫ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తాజాగా ఈ ఉద్యోగుల పనివేళల పై షాకింగ్ కామెంట్స్ చేశారు. రోజుకి 14 గంటలు పని చేయాలని చెప్పారు. మరి ఆయన మాటల వెనుక ఉన్న అర్ధం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి 3వన్4 క్యాపిటల్స్ మొదటి పాడ్‌కాస్ట్ ‘ది రికార్డ్’ ఎపిసోడ్లో మాట్లాడుతూ భారతీయ యువత రోజుకి 14 గంటలు అంటే వీక్ కి 70 గంటల పాటు వర్క్ చేయాలని పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్ కి ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ అయిన మోహన్‌దాస్ పాయ్ యాంకర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తి టెక్నాలజీ, దేశ నిర్మాణం, ఇన్ఫోసిస్ తో పాటు పలు విషయాల గురించి మాట్లాడారు.
ప్రపంచ దేశాలతో పోలిస్తే దేశంలో పని ఉత్పాదకత తక్కువగా ఉందని నారాయణ మూర్తి పేర్కొన్నారు. గత రెండు, మూడు దశాబ్దాల్లో గణనీయమైన ప్రగతి సాధించిన, సాధిస్తున్న దేశాల పక్కన భారత్ ఉండాలంటే దేశ యువత వారానికి 70 గంటల పాటు వర్క్ చేయాలని తెలిపారు. పని ఉత్పాదకత (వర్క్ ప్రొడక్టివిటీ) పెరగడానికి దేశ యువత అధికంగా శ్రమించాలని చెప్పారు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం జర్మనీ, జపాన్ లాంటి దేశాలు ఎలాగైతే కష్టపడి పని చేసాయో, ఇప్పుడు యువత అదే విధంగా పనిచేయాల్సి ఉందని అన్నారు.
అప్పుడే చైనా లాంటి దేశాలతో పోటీపడగలం అని నారాయణ మూర్తి తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. దేశంలో ప్రొడక్టివిటీ పెరగకుండా, గవర్నమెంట్ లో ఓ స్థాయిలో ఉన్న అవినీతిని నిర్మూలించకపోతే, అధికార నిర్ణయాలు త్వరగా తీసుకోకుంటే, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడలేము. అందువల్ల ‘యువత ముందుకు వచ్చి దేశాభివృద్ధి కోసం వారానికి 70 గంటలు పనిచేసేందుకు కట్టుబడి ఉండాలని అన్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?
Ads
Also Read: Apple: ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ ని ఎందుకు రిలీజ్ చేస్తుంది ఆపిల్ కంపెనీ.? కారణం ఇదా.?