Ads
మెగా కాంపౌండ్ లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే రేపు నవంబర్ 1న వీరి పెళ్లి అంగరంగ వైభవంగా ఇటలీ వేదికగా జరుగుతుంది. ఈ పెళ్ళికి కొద్దిపాటి కుటుంబ సభ్యులు హాజరవుతున్నప్పటికీ.. ఇక్కడ అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల కోసం రిసెప్షన్ ని గ్రాండ్ గా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ఎంతో సైలెంట్ గా సాగిన వీళ్ళ ప్రేమ వ్యవహారం జూన్ 9న కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అందరికీ తెలిసింది. ఈ జంటకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో గ్రాండ్ గా జరిగాయి. మెగా ఫ్యామిలీ కొత్త జంట కోసం చేసిన పలు రకాల ఈవెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం వీరికి సంబంధించిన పెళ్లి కార్డు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
Ads
ఈ పెళ్లి పత్రికలో మొదట వరుణ్ తాతా నానమ్మల పేర్లు వేయడం జరిగింది. ఇక తర్వాత పెదనాన్న ,తండ్రి, బాబాయి ,చిన్నన్న ఇలా అందరి పేర్లు పెళ్లి పత్రికలో ప్రచురించారు. మొత్తానికి మా కుటుంబమంతా ఒకటే అని గట్టిగా చెబుతూ మెగా వారి పెళ్లి పత్రిక మెగా హడావిడి చేస్తోంది. ఇక లావణ్య త్రిపాఠి తరపున కేవలం ఆమె తల్లిదండ్రులు కిరణ్, దియోరాజ్ త్రిపాఠి పేర్లను ముద్రించారు. ఇప్పటికే పెళ్లి పనుల కోసం లావణ్య, వరుణ్ ఇద్దరు ఇటలీ చేరుకోవడం జరిగింది. ఈ విషయాన్ని తన ఇన్స్టా పేజీలో వెల్లడించారు.
ఇది ఇలా ఉంటె…సోషల్ మీడియాలో ఈ పెళ్లి కార్డు ధర గురించి చర్చ జరుగుతుంది. పెళ్లి కార్డు ఏకంగా 6 లక్షలు పెట్టి డిజైన్ చేయించారు అంట మెగా ఫామిలీ. పెళ్లి కార్డుకే అన్ని లక్షలు అంటే…ఆ ఖర్చులో మధ్యతరగతి కుటుంభంలో పెళ్లి చేసేయచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇంక పెళ్ళికి ఏ రేంజ్ లో ఖర్చు పెడతారో అని ఆశ్చర్యపోతున్నారు మెగా ఫాన్స్. సెలబ్రిటీ పెళ్లిళ్లు అంటే ఇవి కామన్ ఏ కదా.?