Ads
నటి రెంజూష మీనన్ చనిపోయిన విషయం మరువకముందే మలయాళ సినీ పరిశ్రమలో మరోక విషాదం చోటు చేసుకుంది. బుల్లితెర నటి మరియు డాక్టర్ ప్రియ గుండెపోటుతో కన్నుమూసింది.
ఎనిమిది నెలల గర్భిణి అయిన ప్రియ చెకప్ కోసం హాస్పటల్ కి వచ్చింది. కానీ ఇంతలోనే గుండెపోటు రావడంతో ప్రియ అక్కడే కుప్పకూలి చనిపోయింది. అయితే ఆమె శిశువును మాత్రం కాపాడగలిగారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మలయాళ పరిశ్రమ ఒకటి తర్వాత మరొకటి దిగ్భ్రాంతికరమైన మరణ వార్తలతో అతలాకుతలం అవుతోంది. ప్రముఖ టీవీ నటి రెంజూషా మీనన్ మరణించిన రెండు రోజులకే, మరో స్టార్ మరణ వార్త మాలీవుడ్ ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మలయాళ టెలివిజన్ ఇండస్ట్రీ పాపులర్ నటి, డాక్టర్ ప్రియ బుధవారం నాడు గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 35. ప్రియ ఎనిమిది నెలల ప్రెగ్నెంట్. చెకప్ లో భాగంగా హాస్పటల్ కి వెళ్ళిన ప్రియ, అక్కడే గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కిందపడి పోయారు.
ఆమెకు డాక్టర్లు వెంటనే సర్జరీ చేసి గర్భంలోని శిశువును కాపాడారు. కానీ ప్రియను బతికించలేకపోయారు. ఆ శిశువును ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆమె చనిపోయిన విషయాన్ని యాక్టర్ కిషోర్ సత్య సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో “మలయాళ టెలివిజన్ రంగంలో మరో ఊహించని మరణం. డాక్టర్ ప్రియ నిన్న గుండెపోటుతో మరణించారు. ఆమె 8 నెలల గర్భిణి. పాప ఐసీయూలో ఉంది. ఇతర ఆరోగ్య సమస్యలు లేవు” అని రాశారు.
ఆయన ప్రియ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ”ఒక్కగానొక్క కూతురు మరణాన్ని తట్టుకోలేక విలపిస్తున్న తల్లి. 6 నెలలుగా ఎక్కడికీ వెళ్లకుండా ఆమెతోనే ఉన్న భర్త, ఈ బాధ నుండి ఎలా బయటికి వస్తారో? నమ్మిన అమాయక మనుషుల పట్ల దేవుడు ఎందుకు అన్యాయం చేశాడో? ఈ బాధను తట్టుకోగలిగే శక్తిని వారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చాడు. డాక్టర్ ప్రియ మలయాళ సీరియల్ ‘కరుతముత్తు’తో గుర్తింపు తెచ్చుకుని, పాపులర్ అయ్యారు. బుల్లితెర పై విజయవంతంగా కొనసాగింది.
Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. కానీ అంతలోపే..? అసలు ఏం జరిగిందంటే..?