Ads
దీపావళి ముందుగా వచ్చే త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ఈ ధనత్రయోదశినే ధంతేరాస్ అని పిలుస్తారు. ఈ పండుగకు చాలా విశిష్టత ఉంది. ఈ సంవత్సరం నవంబర్ 10న ధంతేరాస్ వచ్చింది. అయితే ఈ రోజు చాలామంది బంగారం కొనుగోలు చేస్తారనే విషయం తెలిసిందే.
అయితే అందరికీ బంగారం కొనే అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల ఆ రోజు బంగారం కాకుండా వేరే వస్తువులను కూడా కొనుగోలు చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కొన్ని ప్రాంతాల వారు దీపావళి పండుగను 5 రోజుల పాటు జరుపుతారు. ఈ 5 రోజుల దీపావళి పండగ ధంతేరాస్ నుండి మొదలవుతుంది. చాలామంది ధంతేరాస్ రోజున బంగారాన్ని కొంటె లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని విశ్వసిస్తారు. అందువల్ల ఆ రోజు బంగారం కొనుగుళ్ళు అధికంగా జరుగుతాయి. ఈ రోజున బంగారమే కాదు కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేయడం చాలా శుభప్రదం అని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
శ్రీ యంత్రం:
ధంతేరాస్ రోజు బంగారానికి బదులుగా శ్రీయంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు. అక్షయ తృతీయ రోజు పూజగదిలో శ్రీ యంత్రాన్ని ప్రతిష్టించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంట్లో కురుస్తుందని పండితులు చెబుతున్నారు.
దక్షిణవర్తి శంఖం:
Ads
లక్ష్మీదేవికి దక్షిణవర్తి శంఖం అంటే చాలా ప్రీతికరం. ధంతేరాస్ రోజున దక్షిణావర్తి శంఖాన్ని కొనుగోలు చేసి ఆ రోజు లక్ష్మీదేవిని పూజించే సమయంలో దేవాలయంలో ఆ శంఖాన్ని పెట్టడం వల్ల వారి ఇంట్లో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి.
కుండ:
ధంతేరాస్ రోజున బంగారంకు బదులుగా మట్టి కుండను కొనుగోలు చేసి, ఇంట్లో పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు ఆ రోజున మట్టికుండను దానం చేయడం మంచిది.
గవ్వలు:
ధంతేరాస్ రోజున గవ్వలను కొనుగోలు చేసి, ఇంట్లో లక్ష్మీ దేవి పాదాల దగ్గర సమర్పించాలి. తరువాతి రోజు పొద్దున స్నానం చేసిన అనంతరం ఆ గవ్వలను రెడ్ క్లాత్ లో చుట్టి డబ్బు దాచుకునే పెట్టెలో ఉంచితే మీపై లక్ష్మీ దేవి అనుగ్రహం కురుస్తుంది. సిరిసంపదలతో నిండి పోతుందని పండితులు చెబుతున్నారు.
బార్లీ:
ధంతేరాస్ రోజు బార్లీని కూడా కొనుగోలు చేయవచ్చు. లోబడ్జెట్ వల్ల బంగారం కొనలేకపోతే బార్లీని మీరు కొనవచ్చు. ఆ రోజున బార్లీని కొనడం చాలా శ్రేయస్కరం. పూజ చేసేటపుడు విష్ణు పాదాల దగ్గర బార్లీ గింజలను సమర్పిస్తే, ఇంట్లో ధనం పెరుగుతుందట.
Also Read: ఏలినాటి శని అంటే అంటే.? దాని నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి.?