Ads
టీమిండియా స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా ఒకరిగా పరిగణించబడ్డారు. జాతీయ జట్టులో చేరిన కొద్ది కాలంలోనే కీలక ప్లేయర్ గా మారాడు.
ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో బుమ్రా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్ట్ లో మూడో ప్లేస్ కి చేరుకున్నాడు. బుమ్రా గొప్ప క్రికెటర్ గా ఎదగడం వెనుక అతని తల్లి దల్జీత్ బుమ్రా జస్ప్రీత్ చేసిన త్యాగాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
జస్ప్రీత్ బుమ్రా పాపులర్ మరియు గొప్ప ఇండియన్ క్రికెటర్లలో ఒకరు. ఫాస్ట్ బౌలింగ్ తో బుమ్రా అంతర్జాతీయంగా చాలా ఫేమస్ అయ్యారు. ఆయన వ్యక్తిత్వం అతని బౌలింగ్ లానే గొప్పగా ఉంటుంది. ఇది బుమ్రాకు తల్లి దల్జీత్ నుండి వచ్చింది. బుమ్రా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసి, పెంచింది. బుమ్రా 5 ఏళ్ల వయస్సులో ఉన్న సమయంలో తండ్రి జస్బిర్ బుమ్రా కన్నుమూశారు. దాంతో తల్లి దల్జీత్ తన ఫ్యామిలీ బాధ్యతలను తీసుకున్నారు. ఆమె స్కూల్ టీచర్ గా పనిచేయడం మొదలుపెట్టారు.
క్రికెట్ కెరీర్ మొదట్లో బుమ్రా ఖర్చుల కోసం అతని తల్లి ఇంటిని తాకట్టు పెట్టారు. తన పిల్లలకు మంచి ఆరోగ్యం, కెరీర్ ను ఇచ్చేందుకు బుమ్రా తల్లి అనేక ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కోన్నారు. ఆమె ఉద్యోగం చేస్తూనే, పిల్లల చదువుకు కావాల్సిన అవసరాలను చూస్తూ, వారికి ఎమోషనల్ గా మద్ధతు ఇచ్చి, వారికిష్టమైన రంగంలో ప్రోత్సహించారు. బుమ్రాకు క్రికెట్ పైన ఉన్న ఆసక్తిని ముందుగానే గుర్తించిన దల్జీత్, ఆ వైపుకు అతనికి ప్రోత్సాహం ఇచ్చారు.
క్రికెట్ లో బుమ్రా విజయం సాధించడంలో అతని తల్లి దల్జీత్ ముఖ్యమైన పాత్రను పోషించినట్టు బుమ్రా చాలా సందర్భాలలో వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ కప్ టోర్నీలో మంచి ప్రదర్శనను కనపరుస్తున్నాడు. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Ads
Also Read: వరల్డ్ కప్ లో ఇండియాకి సౌత్ ఆఫ్రికాతో ఓడితేనే లాభం అంట…అప్పుడే ఆ కల నెరవేరుతుందా.?