Ads
జబర్దస్త్.. ఈ షో లో ఇచ్చే జబర్దస్త్ కామెడీ కి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ప్రస్తుతం బుల్లితెరపై ఆల్ టైం ఫేవరెట్ గా సాగుతున్న షో జబర్దస్త్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇక ఈ షో కి యాంకర్ గా సౌమ్య రావు ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌమ్యరావు ప్లేస్ లో బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంత్ ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది.
జబర్దస్త్ షో కి చాలాకాలం యాంకర్ గా వ్యవహరించిన అనసూయ తప్పుకున్న తర్వాత ఆ ప్లేస్ ఎవరు భర్తీ చేస్తారు అని పెద్ద డిస్కషన్ జరిగింది. యాంకర్లతో ప్రయోగాలు చేసి ఇక ఫైనల్ గా కన్నడ బ్యూటీ సౌమ్య రావుని ఫీల్డ్ లోకి దింపారు. ఒకటిన్నర సంవత్సరం నుంచి జబర్దస్త్ లో సౌమ్యారావు తన జబర్దస్త్ యాంకరింగ్ తో మంచి ఆదరణ పొందింది. అయితే ఇప్పుడు మీ ప్లేస్ లో సిరి హన్మంత్ వచ్చింది.యూట్యూబ్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న సిరి హన్మంత్ బిగ్ బాస్ సీజన్ 5 లో సందడి చేసింది.
Ads
ఒకవైపు యాంకరింగ్ చేస్తూ మరోవైపు నటిగా రాణించాలి అనుకుంటున్న సిరికి ఇది మంచి ఆఫర్ అని చెప్పాలి. అనసూయ, రష్మీ గౌతమ్ స్టార్లుగా ఎదగడానికి జబర్దస్త్ షో ముఖ్య కారణం. ఈ నేపథ్యంలో సోలోకి ఎంట్రీకి ఇచ్చిన కొత్త యాంకర్ కి కమెడియన్స్ తో పాటు జడ్జ్ లు కూడా ఆహ్వానం పలికారు. ఆమెను హైలైట్ చేస్తూ నడిపించిన ఈ షో కి సంబంధించి ప్రోమో ని కూడా విడుదల చేశారు. సిరి సోలో సందడి చేసిన నూకరాజు కొత్త యాంకర్ నెల రోజులే అంటూ వేసిన పంచ డైలాగ్ కి కాస్త ఫీల్ అయినట్టు కనిపించింది. సిరి ఎన్ని రోజులు యాంకర్ గా కొనసాగుతుందో చూడాలి మరి.
watch video: