Ads
వరల్డ్ కప్ లో ఇండియా టీం ఏ రేంజ్ లో దూసుకుపోతుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. టేబుల్ టాపర్ గా నిలుస్తూ ప్రతి ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నిట్లో సూపర్ ఫార్మ్ లో ఉంది టీం ఇండియా. వరుస విజయాలతో సెమీఫైనల్స్ వరకు దూసుకు వచ్చింది. ఇక ఈ లీగ్ చివరి మ్యాచ్ ను నవంబర్ 12న నెదర్లాండ్స్ తో ఆడడానికి భారత్ సిద్ధంగా ఉంది.
నెదర్లాండ్స్ టీం ని ఓడించడం భారత్ కు నల్లేరు మీద నడకతో సమానం అనడంలో ఎటువంటి డౌటు లేదు.. అయితే అసలు ముప్పు ఆ తర్వాతే ఉంది. ఈ టోర్నమెంట్ లో భారత్ ఆడిన ఎనిమిది మ్యాచ్లలో రోహిత్ సేన మంచి ఫామ్ లో చక్కటి ప్రదర్శన కనబరుస్తోంది.
ఇది ఇలా ఉంటె…క్రికెటర్ల వ్యక్తిగత విషయాలు వాళ్లు చెప్పకుండానే అందరికీ తెలిసిపోతాయి. ఇందులో ముఖ్యంగా లైమ్ లైట్ లోకి వచ్చేవి వాళ్ల రిలేషన్ షిప్ వివరాలు. అలా కొంత మంది యంగ్ క్రికెటర్స్, ఇంకా వాళ్లు రిలేషన్ లో ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
#1 పృథ్వీ షా
ఐపీఎల్ 2020 లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరుపున ఆడారు పృథ్వీ షా. పృథ్వీ షా ప్రాచీ సింగ్ తో రిలేషన్ లో ఉన్నారు. ప్రాచీ సింగ్ ఒక నటి. కలర్స్ ఛానల్ లో టెలికాస్ట్ అయిన ఉడాన్ సీరియల్ లో నటించారు.
#2 రాహుల్ చహర్
ఐపీఎల్ 2020 లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడిన రాహుల్ చహర్ కి, డిసెంబర్ 13, 2019 లో తన గర్ల్ ఫ్రెండ్ ఇషాని తో ఎంగేజ్మెంట్ అయ్యింది. ఇషాని గురించి వివరాలు ఎవరికీ పెద్దగా తెలియవు. కానీ రాహుల్ చహర్ ఇంస్టాగ్రామ్ లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు.
Ads
#3 రుతురాజ్ గైక్వాడ్
రుతురాజ్ గైక్వాడ్ గర్ల్ ఫ్రెండ్ ఉత్కర్ష అంటూ చాలా రూమర్స్ ఏ వచ్చాయి. అతను చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను మహారాష్ట్రలోని పూణేలో పుట్టి పెరిగాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతని ప్రాధాన్యత గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.
#4 ఇషాన్ కిషన్
ముంబై ఇండియన్స్ తరపున ఆడిన ఇషాన్ కిషన్, అదితి హుండియా తో రిలేషన్ లో ఉన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అదితి హుండియా ఒక మోడల్. 2017 లో మిస్ ఇండియా కాంపిటీషన్ లో పాల్గొన్నారు. అందులో మిస్ ఇండియా రాజస్థాన్ టైటిల్ గెలుచుకున్నారు. అలాగే 2018 లో మిస్ దివా – 2018 కాంపిటీషన్ లో పాల్గొన్నారు. మిస్ దివా సుప్రానేషనల్ కిరీటం పొందారు.
#5 రిషబ్ పంత్
ఐపీఎల్ 2020 లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడిన రిషబ్ పంత్, ఇషా నేగి తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇషా నేగి ఒక ఎంట్రప్రెన్యూర్, అలాగే ఒక ఇంటీరియర్ డెకర్ డిజైనర్.
#6. నవదీప్ సైనీ
పూజా బిజార్నియా – పేసర్ నవదీప్ సైనీ గర్ల్ ఫ్రెండ్. నవదీప్, పూజ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఐపీఎల్ లో RCB జట్టులో కీ బౌలర్ సైని. ఇండియా తరపున కూడా ఆడాడు.