Ads
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎప్పుడు ఏది జరిగినా కూడా క్షణాల్లోనే అది వైరల్ గా మారిపోతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా జరిగిన విషయాలను ఇంట్లోనే కూర్చొని తెలుసుకుంటున్నారు. కాగా ఇటీవల కాలంలో మనకు ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న వీడియోలు సర్ప్రైజ్ వీడియోస్. వైఫ్ కి ఫ్యామిలీస్ కి బ్రదర్ అండ్ సిస్టర్స్ కి సర్ప్రైజ్లు ఇస్తూ అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్లో ఇంస్టాగ్రామ్స్ లో ట్విట్టర్లలో షేర్ చేస్తూ ఉంటారు.
ఏళ్ల తర్వాత ఇంటికి రావడం ఫ్యామిలీలకు ఊహించని సర్ప్రైజ్ ఇవ్వడం అన్నది ఇటీవల కాలంలో బాగా ట్రెండ్ అయిపోయింది. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఆ వీడియోలో ఇదేళ్ల తర్వాత బాయ్ ఫ్రెండ్ ని చూసిన ఒక యువతి విమానాశ్రయంలో చేసిన పనికి ప్రియుడు కంటతడి పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఆ వీడియోలో ఒక మహిళ తన ప్రియుడికి కెనడా విమానాశ్రయంలో ఊహించని విధంగా స్వాగతం పలికింది. ఎయిర్‌పోర్టు గేటు నుంచి బయటకు వస్తున్న అతడికి మొదట కొందరు వ్యక్తులు పూల బోకేను చేతిలో పెట్టారు.
ఆ తరువాత మహిళ అతడికి ఎదురుపడి డ్యాన్స్ చేసింది. ప్రియుడిని చూసిన ఆనందంలో ప్రియురాలు డాన్స్ చేయగా ప్రియురాలు చేసిన పనికి కంటతడి పెట్టుకోవడంతో పాటు ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఇదంతా పక్కనే ఉన్న మరొక వ్యక్తి రికార్డ్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. డాన్స్ చేస్తుండగా ఎయిర్ పోర్ట్ లో ఉన్న వారందరూ కూడా కాస్త వింతగా చూశారు. వీడియో చాలా బాగుంది సో క్యూట్ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.