Ads
తాజాగా శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం సాధించడంతో వరల్డ్ కప్ 2023 నుంచి పాకిస్థాన్ వర్చువల్‌గా నిష్క్రమించిన విషయం మనందరికి తెలిసిందే. లంకపై గెలిచిన కివీస్ ఖాతాలో మొత్తంగా పది పాయింట్లు చేరాయి. చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై గెలిస్తే పాకిస్థాన్ ఖాతాలోనూ పది పాయింట్లు చేరతాయి. సౌత్ ఆఫ్రికాపై గెలిస్తే అప్ఘానిస్థాన్ ఖాతాలోనూ పది పాయింట్లు చేరతాయి. మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాక్ సెమీస్ చేరాలంటే ఇంగ్లాండ్ పై కనీసం 280 పరుగుల తేడాతో గెలుపొందాలి. ఒకవేళ ఛేజింగ్‌కు దిగితే ఐదు ఓవర్ లలోపే లక్ష్యాన్ని చేధించాలి.
ఇక పాకిస్థాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించడం అన్నది దాదాపు అసాధ్యం. అయితే పాక్ సెమీస్ చేరేందుకు ఆ జట్టు మాజీ పేసర్ వసీం అక్రమ్ అద్భుతమైన సలహా ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఒక న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ అక్రమ్ చేసిన ఈ సరదా సూచన ప్రస్తుతం నవ్వులు తెప్పిస్తోంది. పాకిస్థాన్ ఇప్పటికీ సెమీస్‌కు అర్హత సాధించగలదు. దీనికి వసీం భాయ్ ఒక ఐడియా ఇచ్చాడు.
Ads
అదేంటంటే పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేయాలి. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంచి 20 నిమిషాల పాటు తాళం వేయాలి. అప్పుడు వాళ్లంతా టైమ్డ్ ఔట్ అవుతారు అంటూ పాకిస్థాన్ టీవీ ఛానల్ ఏ స్పోర్ట్స్ హోస్ట్ చెప్పుకొచ్చారు. అయితే ఈ మాట చెప్పగానే అక్కడున్నవారంతా పడిపడి నవ్వారు. అయితే అదే షోలో పాల్గొన్న మిస్బా ఉల్ హక్ కలుగజేసుకొని మరో ఐడియా ఇచ్చాడు.
ఇంగ్లాండ్‌ను ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటే.. వారందర్నీ డ్రెస్సింగ్ రూంలో ఉంచి లాక్ చేయండి. వాళ్ల ముందు టార్గెట్ ఉంచాల్సిన అవసరమే ఉండదు అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. దీంతో ఇలా జరిగితే ఇంగ్లాండ్ వాళ్ళ రియాక్షన్ బాద్షా లో బ్రహ్మానందం లాగా ఎంతకు తెగించారురా అన్నట్టు ఉంటుంది అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు ట్రోల్ చేయక్కర్లేదు. మిమ్మల్ని మీరే చేసుకుంటారు అంటూ మరి కొందరు మీమ్స్ వేస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో లంక ఆటగాడు ఏంజెలో మ్యాథ్యూస్ టైమ్డ్ ఔట్ రూపంలో ఔటైన సంగతి తెలిసిందే. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతోపాటు చర్చనీయాంశమైంది.