పాయల్ రాజ్‌పుత్ “మంగళవారం” సినిమాని “చిరంజీవి” ప్రోమోట్ చేయడానికి కారణం ఇదా.?

Ads

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంగళవారం. ఈ మూవీకి డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం మూవీ నవంబర్ 17న రిలీజ్ కానుంది.

ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ చిన్న సినిమాకి మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ హీరోలు మద్ధతు తెలుపుతుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నెట్టింట్లో చర్చలు జరుగుతున్న క్రమంలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మంగళవారం సినిమా ట్రైలర్ లాంచ్ మెగాస్టార్ చిరంజీవి చేశారు. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. దీంతో చిన్న సినిమాకి పెద్ద స్టార్లు సపోర్ట్ చేయడం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. మెగా హీరోలెవరు కూడా అజయ్ భూపతితో సినిమా చేయట్లేదు. మరి వీరేందుకు మద్దతు ఇస్తున్నారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజకు ఈ మూవీతో సంబంధం ఉండడం వల్లే మెగా హీరోలు మంగళవారం మూవీకి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మెగాడాటర్ శ్రీజ ఫ్రెండ్ ఈ చిత్రానికి ప్రొడ్యూసర్. మంగళవారం సినిమా నిర్మిస్తున్న స్వాతి రెడ్డి శ్రీజకు స్నేహితురాలు. అది మాత్రమే కాకుండా స్వాతి రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె.
తన ఫ్రెండ్ స్వాతి రెడ్డి నిర్మిస్తున్న సినిమా కావడం వల్ల, శ్రీజ కోరిక మేరకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలు ఈ చిన్న సినిమాకు మద్దతు తెలుపుతున్నారంటూ ఈ న్యూస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరోవైపు మంగళవారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన అల్లు అర్జున్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Ads

Also Read: ఎలాంటి చెడు అలవాట్లు లేవు…కానీ రూ.100 కోట్ల ఆస్తిని “చంద్రమోహన్” ఎలా పోగొట్టుకున్నారు.?

Previous articleప్రేమించి పెళ్లి చేసుకొని…దీపావళి రోజే ఇలా…? ఇలాంటి భర్తను ఏమనాలి.?
Next articleఒకప్పుడు జాబ్ లో నుంచి తీసేసారు… కానీ ఇప్పుడు ఏకంగా 100 మందికి యజమాని అయ్యాడు?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.