ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసి కట్టుకునే చీరలకు అంత ప్రత్యేకత ఉందా..? వాటి ధరలు ఎంతో తెలుసా?

Ads

రాను రాను రోజురోజుకీ సీరియల్స్ కి ప్రేక్షకాదరణ ఎక్కువ అవుతోంది. ఈ వరకు రోజుల్లో కేవలం సీరియల్స్ ని ఆడవాళ్లు మాత్రమే చూసేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో మగవాళ్లు కూడా సీరియల్స్ చూస్తున్నారు. అలా సీరియల్స్ కి మంచి ఆదరణ లభిస్తుందడంతో కొత్త కొత్త సీరియల్స్ వస్తూనే ఉన్నాయి.

సీరియల్స్ అనగానే కేవలం కథ కథనం ట్విస్టులు మాత్రమే కాదు.. ఆడవాళ్లు అయితే అందులో నటీమణులు వేసుకునే గాజులు బ్లౌజులు, చీరలు, నగలు ఇలా ప్రతి ఒక్క విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక మగవారు కూడా హీరోలు విలన్లు వేసుకునే డ్రెస్సులు, షూస్ ఇలా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. హీరోలు ఎంత బాగా రెడీ అయినప్పటికీ హీరోయిన్ చక్కగా అందంగా రెడీ అయింది అంటే చాలు హీరోలను డామినేట్ చేస్తూ ఉంటుంది.

intinti gruhalakshmi serial tulasi sarees specialty

అంత బాగా చక్కని చీరలు అందుకు తగ్గట్టు జ్యువెలరీ వేసుకొని ప్రేక్షకులను కూడా బాగా ఆకర్షిస్తూ ఉంటారు. చాలా వరకు సీరియల్స్ లో చీరలకు మ్యాచింగ్ బ్లౌజులు గాజులు, కమ్మలు చేతికి వేసుకునే నెయిల్ పాలిష్ రంగు కూడా అన్ని మ్యాచింగ్ ఉంటాయి. ఇక షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు కూడా స్త్రీలు పలాన చీర పలానా సీరియల్ లో పలానా ఆమె కట్టుకుంది అని చెప్పుకొని తెగ మురిసిపోతూ ఉంటారు.

intinti gruhalakshmi serial tulasi sarees specialty

ఆ విషయాన్ని నలుగురికి చెప్పుకొని సంతోష పడుతూ ఉంటారు. ఇక బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి. ఇందులో నటి కస్తూరి శంకర్ తులసి అనే ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. మొదటినుంచి ఈ సీరియల్ ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తూ వస్తున్నారు. ఈ సీరియల్ ని చూసే ఆడవాళ్లు ఎక్కువగా తులసి కట్టుకునే చీరల గురించే చర్చించుకుంటూ ఉంటారు.

intinti gruhalakshmi serial tulasi sarees specialty

Ads

ఇంకా చెప్పాలి అంతే సీరియల్ లో తులసి కట్టే చీరలకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఆమె చీర కట్టు భలే హుందాగా ఉంటుంది. మధ్య తరగతి గృహిణి పాత్రలో తులసి అంతలా ఒదిగిపోయి ఉంటుంది. ఆమె చీరలు చాలా సింపుల్‌గా ఉంటాయి. డబుల్ కలర్ మిక్సింగ్‌లో కాటన్ చీరలనే కట్టుకుంటుంది తులసి. అయితే చాలా వరకూ సీరియల్స్‌లో క్యాస్ట్యూమర్స్ ఇచ్చే వాటికంటే సొంతంగా తెచ్చుకునేవే ఎక్కువగా ఉంటాయి.

intinti gruhalakshmi serial tulasi sarees specialty

మరింత అందంగా మరింత హుందాగా కనిపించడం కోసం సొంత చీరలు, నగల్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు సీరియల్స్ నటిమనులు. అలా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో తులసి చీరలు కూడా ఆమె సొంతంగా కొనుక్కున్నవేనట. వాటి ధర కూడా కొన్ని వేలల్లో ఉంటే కొన్ని చీరల ధర లక్షల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గృహలక్ష్మి సీరియల్ లో తాను ధరించి దుస్తుల విషయం గురించి తులసి అలియాస్ కస్తూరి శంకర్ మాట్లాడుతూ…

intinti gruhalakshmi serial tulasi sarees specialty

నేను కట్టే చీరల్లో కొన్ని చీరలు షూటింగ్‌లో ఇస్తారు. మొన్నటి ఎపిసోడ్‌లో కట్టుకున్న రోజ్ కలర్ శారీ అయితే అది నా బెస్ట్ ఫ్రెండ్ కొనిచ్చాడు. ఆయన పుట్టిన ఊరు చేనేత చీరలకు ఫేమస్. ఈ చీర అక్కడ నుంచి నాకోసం పట్టుకొచ్చి గిఫ్ట్ ఇచ్చారు. నాకు రెండు చీరలు కొనిచ్చాడు. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అని ఈ చీర గిఫ్ట్‌గా ఇచ్చారు. కొన్ని చీరలు నాకు చాలా సెంటిమెంట్.

intinti gruhalakshmi serial tulasi sarees specialty

ఎందుకంటే అవి మా అమ్మ కట్టుకునే చీరలు. మా అమ్మ అడ్వికేట్ కాబట్టి..ఎక్కువగా కాటన్ చీరలు కట్టుకునేవారు. ఆ చీరలన్నీ ఇప్పుడు నేను వాడుతున్నాను. సీరియల్‌ లో తులసి అన్నీ సింపుల్ చీరలే కడుతుంది. కానీ ఆ సింపుల్ చీరల్లోనే హుందా ఉంటుంది. ఆ హుందాతనం ఉండేలా నేను చీరలు సెలెక్ట్ చేసుకుని కడుతుంటాను అంటూ చెప్పుకొచ్చారు నటి కస్తూరి శంకర్.

Previous articleపుష్ప కేశవ అలియాస్ నటుడు “జగదీష్” ని ఎందుకు అరెస్ట్ చేశారు..? అసలు విషయం ఏంటంటే..?
Next articleHI NANNA REVIEW : “నాని, మృణాల్ ఠాకూర్” కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.