Ads
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఆ జట్లు అహ్మదాబాద్ లో ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. ఫైనల్ మ్యాచ్ ను చూడడానికి దేశంలో ఉన్న ప్రముఖులందరూ హాజరుకానున్నారు. అయితే ఇప్పుడు ఫైనల్ లో తలపడుతున్న ఆస్ట్రేలియా, ఇండియా జట్లు, గతంలో 2003లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో కూడా తలపడ్డాయి.
అయితే అప్పుడు ఆస్ట్రేలియా కప్పు కొట్టింది. అయితే అప్పటికి, ఇప్పటికీ కొన్ని పోలికలు ఉన్నాయంటు క్రికెట్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. దాని ప్రకారం చూస్తే ఈసారి ఇండియా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ పోలికలు ఏంటంటే….
#1. 2003లో ఆస్ట్రేలియా వరస విజయాలతో ఫైనల్ కి చేరుకుంది. అప్పుడు గ్రూప్ దశలో పది మ్యాచ్ లు నెగ్గింది. టాప్ టీం గా కొనసాగింది. ఇప్పుడు 2023లో అదే తీరులో భారత్ కనిపిస్తుంది. గ్రూప్ దశలో పది మ్యాచ్ లు నెగ్గి ఫైనల్ కి చేరుకుంది.
Ads
#2. 2003లో గ్రూప్ దశలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. కాగా 2023లో గ్రూప్ దశలో భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. అప్పుడు ఫైనల్లో తలపడినట్లుగానే ఇప్పుడు కూడా భారత్ ఆస్ట్రేలియా జట్లు ఫైనల్లో అమీ తుమీ తేల్చుకోనున్నాయి.
#3. 2003లో వికెట్ కీపర్ గా రాహుల్ ద్రావిడ్ కీలక పాత్ర పోషించాడు. కీపింగ్ లో రాణిస్తూ ఏకంగా 11 మ్యాచ్ లలో 318 పరుగులు చేశాడు. అదే తరహాలో ఇప్పుడు రెగ్యులర్ వికెట్ కీపర్ కాని కేఎల్ రాహుల్ కూడా కీపింగ్ లో ఇరగదీస్తున్నాడు. 10 మ్యాచ్ లు ఆడి 386 పరుగులు చేశారు. అప్పుడు రాహల్ ద్రావిడ్ వైస్ కెప్టెన్ కాగా, ఇప్పుడు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్.
#4. 2003లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా సచిన్ రికార్డు సృష్టిస్తే 2023లో కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
#5. 2003లో రిక్కీ పాయింటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ఉన్న ఫామ్ ఇప్పుడు 2023లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇండియా అదే ఫామ్ లో ఉంది.
2003కి 2023 కి ఇన్ని పోలికలు ఉండగా, అన్ని కూడా భారత్ కి అనుకూలంగానే ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే ఇండియా కప్పు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.