Ads
ఎంతో ఉత్కంఠగా టీం ఇండియాకి, ఆస్ట్రేలియాకి మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచి కప్ సాధించింది. అయితే ఆస్ట్రేలియా కప్ గెలిచింది అనే సంబరం కంటే ఇండియా ఓడిపోయింది అనే బాధ కప్ అందిస్తున్న సమయంలో చాలా ఎక్కువగా కనిపించింది.
సోషల్ మీడియా అంతటా కూడా ఈ విషయం గురించే మాట్లాడుతున్నారు. “ఇండియా చాలా బాగా ఆడింది” అని, “ఇండియాకి కప్ రావాల్సింది” అని అన్నారు. అంతే కాకుండా ఇండియా ఓడిపోవడంతో ఇండియన్ ప్లేయర్స్ ని ప్రోత్సహిస్తూ ఎంతో మంది పోస్ట్ వేశారు.
అంతే కాకుండా ఆ తర్వాత ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్ష్ వరల్డ్ కప్ జరిగిన తర్వాత ఆ కప్ ని తన కాళ్ళ కింద పెట్టుకున్న ఫోటో చాలా కామెంట్స్ కి దారి తీసింది. ఇప్పుడు ఆస్ట్రేలియా టీంకి ఇంకొక ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా టీం కెప్టెన్ పాట్ కమిన్స్ సిడ్నీకి వెళ్లిన తర్వాత అక్కడ మీడియా వాళ్ళు కానీ, అభిమానులు కానీ కనిపించలేదు. సాధారణంగా కప్ గెలిచి వెళ్లిన తర్వాత ఆ దేశ ప్రజలు మొత్తం వాళ్ళని ఎంతో గొప్పగా చూస్తారు. కానీ ఈ సారి మాత్రం అది జరగలేదు.
Ads
ఆస్ట్రేలియా టీం కెప్టెన్ పాట్ కమిన్స్ సిడ్నీ ఎయిర్ పోర్ట్ లో తన లగేజ్ తీసుకొని నిశ్శబ్దంగా వెళ్లిపోయారు. అలా వెళ్తున్న మనిషిని ఎవరూ కనీసం పట్టించుకోని కూడా పట్టించుకోలేదు. ఈ ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవ్వడంతో దీన్ని చూసినవాళ్లు అందరూ వారి స్టైల్ లో కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.
కొంత మంది ఈ ఫోటో చూసి, “మా ఆఫీస్ దగ్గర టీ షాప్ లో ఇంతకంటే ఎక్కువ మంది జనాలు ఉంటారు” అని అంటే, మరి కొంత మంది ఈ ఫోటో చూసి, “ఎవరైనా ఒక ఎన్నారై భారతదేశానికి వస్తున్నారు అంటే వాళ్లని చూడడానికి ఇంతకంటే ఎక్కువ మంది జనాలు వస్తారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత వాళ్ళని ఎవరు పట్టించుకోకపోవడం అనేది బాధాకరమైన విషయం.
watch video :
Pat Cummins returning to Australia with World Cup.
Isse zyada log humare yahan office ki tapri pe mil jaate hain kisi bhi time jao pic.twitter.com/JyJYPyVKTV
— Pakchikpak Raja Babu (@HaramiParindey) November 22, 2023
ALSO READ : 1987 లో తండ్రి…2023 లో కొడుకు…వరల్డ్ కప్ గెలిచిన ఈ తండ్రి కొడుకులు ఎవరంటే.?