Ads
సాధారణంగా తెలుగు భాష ప్రేక్షకులకి సినిమాల మీద అభిమానం చాలా ఎక్కువ. భాషతో సంబంధం లేకుండా ఏ భాష సినిమా అయినా సరే తెలుగు వాళ్ళు చూసి ఆదరిస్తారు. ఇది మిగిలిన భాషల ఇండస్ట్రీకి చాలా బాగా తెలుసు.
అందుకే మన సినిమాలు వాళ్ళ భాషల్లో డబ్బింగ్ చేసి ఎన్ని విడుదల అవుతాయో తెలియదు కానీ, ఒక సంవత్సరంలో డైరెక్ట్ తెలుగు సినిమాలకి పోటీగా డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల అవుతూ ఉంటాయి. అయితే ఓటీటీ పుణ్యమా అని ఎన్నో భాషల కంటెంట్ ని చూసే సౌలభ్యం దొరికింది.
అన్ని సినిమాలు కూడా డబ్ అయ్యి తెలుగులో విడుదల అవ్వలేవు. అందుకే కొన్ని డిజిటల్ రిలీజ్ అయినప్పుడే డబ్బింగ్ చేస్తున్నారు. అలా డబ్బింగ్ సినిమా అయినా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించిన సినిమాల్లో ఈ మలయాళం సినిమా కూడా ఒకటి. ఈ సినిమా పేరు జయ జయ జయ జయ హే. దర్శన రాజేంద్రన్, బేజిల్ జోసెఫ్ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. జయ భారతి అనే ఒక అమ్మాయి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
Ads
చిన్నప్పటి నుండి కూడా ఇంట్లో ఆడవారికి ఒక న్యాయం, మగవారికి ఒక న్యాయం అనే వివక్షని ఎదురుకుంటూ పెరుగుతుంది జయ. కాలేజ్ సమయంలో జయ తన లెక్చరర్ అయిన ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. అందుకు ముఖ్య కారణం ఆయన కాలేజ్ లో ఆడవారు చాలా గొప్పవారు అని మాట్లాడుతాడు. కానీ తర్వాత జయని అనుమానిస్తూ ఉంటాడు. ఒకసారి కొడతాడు కూడా. అయితే ఇదంతా జయ వాళ్ళ ఇంట్లో తెలియడంతో రాజేష్ అనే ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇక్కడ రాజేష్ కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు.
ఇలాంటి పరిస్థితుల నుండి జయ ఎలా బయటపడింది? అలా బయటపడ్డాక తన ఇంట్లో వారి నుండి ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కొంది? ఈ విషయాలు అన్నీ ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. సినిమా స్టోరీ లైన్ చాలా సీరియస్ గా ఉంటుంది. కానీ సినిమా మాత్రం కామెడీగా ఉంటుంది. ఇలాంటి ఒక విషయాన్ని ఇంత కామెడీగా చూపించడం అనేది సాహసం అయిన విషయమే.
సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే సీన్ అయితే చాలా బాగా చిత్రీకరించారు. ఇంక నటీనటుల విషయానికి వస్తే ఎవరి పాత్రలో వారు చాలా బాగా నటించారు. టైటిల్ లో ఉండే జయ భారతి పాత్ర పోషించిన దర్శన రాజేంద్రన్ అయితే ఆ పాత్రలో చాలా బాగా నటించారు. ఈ సంవత్సరం వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది.
ALSO READ : “స్కంద” సినిమాలో… “లాజిక్” లేకుండా తీసిన 5 సీన్స్ ఇవే..!