Ads
సాధారణంగా ఒక మూవీ హిట్ అయ్యిందంటే, వెంటనే ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా తీస్తే అదికూడా హిట్ అవుతుందని మేకర్స్ అనుకుంటారు. అయితే ఈ సీక్వెల్ ఫార్ములా బాలీవుడ్ లో మొదలైంది. అది మెల్లగా సౌత్ లోకి కూడా వచ్చింది.
Ads
అయితే ఈ ఫార్ములా నార్త్ లో వర్కౌట్ అయ్యింది. ఆ తరువాత తమిళంలో కూడా కొంతవరకూ పని చేసింది. కానీ తెలుగులోకి వచ్చేసరికి సీక్వెల్ ఫార్ములా పూర్తిగా బెడిసికొట్టిందనే చెప్పాలి. గతంలో చాలా హైప్ తో వచ్చిన సీక్వెల్స్ రిలీజ్ అయ్యి నిరాశను మిగిల్చాయి. కాగా వాటిలో విజయం పొందినవతిని వేళ్ళపై లెక్కించవచ్చు. ఇక ఎన్నో అంచనాలతో విడుదల అయ్యి, నిరాశపరిచిన తెలుగు సీక్వెల్ చిత్రాలు ఏమిటో చూద్దాం..
మనీ:
రామ్ గోపాల్ వర్మ శిష్యుల్లో తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు.వారిలో ఒకరైన దర్శకుడు నాగేశ్వర రావు ‘మని’ అనే చిత్రాన్ని తెరకెక్కించగా అది విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఈ సినిమాకి వచ్చిన సీక్వెల్ మని మని, మని మని మోర్ మని సినిమాలు చాలా నిరాశ పరిచాయి.శంకర్ దాదా ఎంబిబిఎస్/ జిందాబాద్ :
బాలీవుడ్ మూవీ అయిన మున్నా భాయ్ ఎంబిబిఎస్ ను తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన హిట్ శంకర్ దాదా ఎంబిబిఎస్ హిట్ అయ్యింది. ఈ మూవీలో సంగీతం మ్యాజిక్ చేసింది. ఆ తరువాత వచ్చిన సీక్వెల్ శంకర్ దాదా జిందాబాద్ నిరాశ పరిచింది.
ఆర్య:
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన మూవీ ఆర్య. ఈ మూవీ హిట్ య్యింది. దీనిలో పాటలు, డ్యాన్సులు యూత్ ను బాగా ఆకర్షించాయి. అయితే ఆ తరువాత వచ్చిన ఈ మూవీ సీక్వెల్ ఆర్య 2 మాత్రం ప్లాప్ అయ్యింది.
కిక్:
రవితేజ హీరోగా కామెడీ యాంగిల్ తో వచ్చిన మూవీ కిక్. ఈ మూవీలో రవితేజ ఫుల్ ఎనర్జీతో నటించాడు. థమన్ అందించిన సంగీతం చాలా బాగుంది. హిట్ అయ్యింది. ఇక ఈ మూవీ సీక్వెల్ ఆడియెన్స్ సహనానికి పరీక్ష పెట్టింది. ఈ మూవీ ప్లాప్ అయ్యింది.
గబ్బర్ సింగ్ :
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. వరుస ప్లాప్స్ తో ఉన్న పవన్ కళ్యాణ్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు హరీష్. కానీ ఆ తరువాత బాబీ డైరెక్షన్ లో సీక్వెల్ సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ అయ్యింది.
నాగార్జున మన్మధుడు హిట్ కాగా,మన్మధుడు 2 ఫ్లాప్, రజినీకాంత్ చంద్రముఖి హిట్ కాగా, వెంకటేష్ నాగవల్లి ప్లాప్ అయ్యింది. వీటిలాగే మరిన్ని చిత్రాలు కూడా హిట్ నిరాశపరిచాయి.
Also Read: మెగా ఫ్యామిలీలో ఒకటి కన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న వారు ఎవరో తెలుసా?