Ads
సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు గాంచిన నయనతార క్రేజ్ పెళ్లి తరువాత కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది జవాన్ మూవీతో నయన్ అతిపెద్ద విజయాన్ని అందుకుంది.ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది.
Ads
ఈ మూవీలో యాక్షన్ సీన్స్ లో నయన్ అదరగొట్టేసింది. ఈ మూవీ హిట్ తో బాలీవుడ్ లో నయన్ కు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. నయనతార నటించిన లేటెస్ట్ కోలీవుడ్ మూవీ అన్నపూర్ణి రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఆ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
తెలుగు, తమిళంలో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించిన నయనతార మరోసారి లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణిలో నటించింది. ఈ మూవీ నయన్ కెరీర్లో 75వ చిత్రంగా తెరకెక్కింది. నీలేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సత్యరాజ్, జై, అచ్యుత్ కుమార్, రేణుక, కార్తీక్ కుమార్, కె.ఎస్. రవికుమార్, సురేష్ చక్రవర్తి కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, అన్నపూర్ణి (నయనతార) బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. తండ్రి రంగరాజన్ (అచ్యుత్ కుమార్) శ్రీరంగం ఆలయంలో పూజారి. గవర్నమెంట్ జాబ్ ను కూడా కాదని దేవుడి సేవలో తరిస్తుంటాడు. రంగరాజన్ ఆలయంలో ప్రసాదం తయారి బాధ్యతను తీసుకుంటాడు. తండ్రి ద్వారా అన్నపూర్ణికి వంటలపై ఇంట్రెస్ట్ ఏర్పడి, చెఫ్ కావాలని నిర్ణయించుకుంటుంది.
అయితే రంగరాజన్ కి ఎంబీఏ చేయాలని పట్టుపడడంతో ఎంబీఏ అని తండ్రితో చెప్పి, చిన్ననాటి ఫ్రెండ్ ఫర్హాన్ (జై) హెల్ప్ తో చెఫ్ కోర్సులో చేరుతుంది. అక్కడ నాన్వెజ్ వంటలు చేయడంలో ట్రైనింగ్ తీసుకుంటుంది. అయితే కాలేజీలో అన్నపూర్ణి నాన్వెజ్ వండటం అనుకోకుండా రంగరాజన్ చూస్తాడు. మరీ ఆ తరువాత ఏం జరిగింది? నిజం చేసిన తరువాత తండ్రి ఏం చేశాడు? అన్నపూర్ణి తన చెఫ్ కలను నెరవేర్చుకోవడం కోసం ఏం చేసింది? అనేది మిగిలిన కథ.
Also Read: హయ్ నాన్న కంటే ముందే… ఇదే స్టోరీతో వచ్చిన సినిమా ఎదో తెలుసా..? ఈ సినిమా చూశారా..?