యానిమల్ సినిమా హీరోగా “బ్రహ్మానందం” చేస్తే ఇలాగే ఉంటుందా..? ఈ ఎడిట్ చూస్తే నవ్వాపుకోలేరు..!

Ads

తెలుగు సినిమా, కామెడీ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు బ్రహ్మానందం. బ్రహ్మానందం చాలా మంచి నటులు. ఏ రకమైన ఎమోషన్స్ అయినా కూడా చాలా బాగా పలికించగలుగుతారు. కానీ బ్రహ్మానందం అంటే మాత్రం ముందుగా కామెడీ మాత్రమే గుర్తొస్తుంది.

అందుకు కారణం ఆయన ఎన్నో సినిమాల్లో ఎన్నో రకమైన పాత్రలు చేసి ప్రేక్షకులని నవ్వించారు. ఒక సమయం వరకు వరుసగా సినిమాలు చేసిన బ్రహ్మానందం గత కొంత కాలం నుండి అంత ఎక్కువగా సినిమాలు చేయట్లేదు. కేవలం సెలెక్టివ్ గా సినిమాల్లో కనిపిస్తున్నారు.

కానీ ఇప్పటికి కూడా బ్రహ్మానందంని తెర మీద చూసినప్పుడు ఒక హీరోకి వచ్చిన అన్ని క్లాప్స్, అరుపులు వస్తాయి. ఇటీవల బ్రహ్మానందం కీడా కోలా సినిమాలో కనిపించారు. ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సంపాదించుకుంది. అయితే బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్స్ ని ఎడిట్ చేసి చాలా సినిమాల ట్రైలర్స్ చేస్తారు.

animal trailer funny edit featuring brahmanandam

ఇటీవల అలాగే రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా ట్రైలర్ కూడా బ్రహ్మానందం ఐకానిక్ సీన్స్ తో ఎడిట్ చేసి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోని తెలుగు బ్రో అనే ఒక పేజ్ ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. షేర్ చేసిన వెంటనే ఈ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Ads

animal trailer funny edit featuring brahmanandam

యానిమల్ సినిమా కూడా ఈ వీడియోని షేర్ చేసి, “యానిమల్ పార్క్ సినిమాకి బ్రహ్మానందం గారిని కూడా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా?” అంటూ సందీప్ రెడ్డి వంగాని అడిగారు. ఏదేమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియో కోసం బ్రహ్మానందం నటించిన బాద్షా, ఢీ లాంటి సినిమాల్లోని సీన్స్ ని వాడారు. డిసెంబర్ 9 వ తేదీన షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 1.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది షేర్ కూడా చేశారు. లైక్స్ కూడా వేలల్లో ఉన్నాయి.

watch video :

ALSO READ : గుర్తుపట్టలేనట్టుగా మారిపోయిన ఈ హీరో ఎవరో తెలుసా..? ఇటీవలే సూపర్ హిట్ కొట్టారు..!

Previous articleతాళి కట్టే సమయానికి ఇలా చేయడం ఏంటి..? సినిమాని తలపిస్తున్న సంఘటన..!
Next articleశివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ నియమం తప్పకుండా పాటించాలా..? సోమసూత్రం అంటే ఏంటో తెలుసా..?