Ads
ఇది వరకులా కాదు ఈ మధ్య కాలంలో సినిమాలకు సంబంధించి ఎన్నో మార్పులు చేస్తున్నారు. మన తెలుగు డైరెక్టర్లు పక్క ఇండస్ట్రీ నటీ నటులతో పని చేయడం.. పక్క ఇండస్ట్రీ డైరెక్టర్లు మన తెలుగు ఇండస్ట్రీ నటీ నటులతో పని చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు మూలంగా ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి.
పైగా పక్క రాష్ట్రాలలో హిట్ కొట్టిన డైరెక్టర్ తో సినిమా చేయాలని మన ఇండస్ట్రీ వాళ్ళు అనుకోవడం పక్క రాష్ట్రాల్లో హీరోలతో మంచి కథను తీసుకు రావాలని మన డైరెక్టర్లు అనుకుని సినిమాలను తీసుకు రావడం చాలా కామన్ గా జరుగుతోంది. అయితే ఈ మధ్యకాలంలో పక్క రాష్ట్రాల హీరోలతో మూవీస్ చేసి ఫ్లాప్ అందుకున్న డైరెక్టర్ల జాబితా ఇప్పుడు చూద్దాం.
#1. లింగు స్వామి:
రామ్ తో ‘ది వారియర్’ సినిమాని చేశారు. ఈ కోలీవుడ్ డైరెక్టర్ ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తీసినప్పటికీ సినిమా హిట్ అవ్వలేదు.
#2.తిరు:
గోపీచంద్ తో చాణక్య సినిమా చేసారు. అది హిట్ అవ్వలేదు.
#3. పుష్కర్ గాయత్రి:
ఈ తమిళ్ డైరెక్టర్ హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ తో సినిమా చేశారు కానీ ఇది కూడా హిట్ అవ్వలేదు.
#4. గౌతమ్ వాసుదేవ్ మీనన్:
Ads
సాహసం శ్వాసగా సాగిపో, ఎటో వెళ్ళిపోయింది మనసు వంటి ప్లాప్లు ని తెలుగు హీరోలకి ఇచ్చారు.
#5.మోహన్ రాజా:
మోహన్ రాజా చిరంజీవితో ‘లూసిఫర్’ రిమేక్ చేశారు. కానీ హిట్ కాలేదు.
#6. గౌతమ్ తిన్నునూరి:
టాలీవుడ్ డైరక్టర్ గౌతమ్ తిన్నునూరి ‘జెర్సీ’ చిత్రాన్ని షాహిద్ కపూర్ తో హిందీలో తీసారు. కానీ ప్లాప్ అయ్యింది.
#7. సి.ప్రేమ్ కుమార్:
సి.ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసినా జాను సినిమా హిట్ కాలేదు.
#8. మురుగుదాస్:
మహేష్ తో మురుగుదాస్ చేసిన “స్పైడర్” సినిమా హిట్ కాలేదు.
#9. అనుదీప్:
శివ కార్తికేయన్ హీరోగా ‘ప్రిన్స్’ ని అనుదీప్ తీసుకొచ్చారు. ఇది కూడా హిట్ కాలేదు.
#10. శైలేష్ కొలను:
బాలీవుడ్ నటుడు అయిన రాజ్ కుమార్ తో హిట్ సినిమాకి రిమేక్ చేశాడు. సక్సెస్ అవుతుందని అనుకున్నారు కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేదు.