2023 లో గూగుల్ లో ఎక్కువమంది వెతికింది ఈ రామ్ చరణ్ హీరోయిన్ గురించే అంట…ఎవరంటే.?

Ads

కొద్ది రోజుల్లో 2023 ఏడాది ముగియబోతుంది. రాబోయే న్యూ ఇయర్ 2024కి గ్రాండ్‌గా స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్‌ సెలెబ్రేషన్స్ కోసం ఇప్పటి నుండే ప్లాన్స్‌ వేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా, ఎప్పటిలానే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ ఈసారి కూడా 2023లో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల‌ వివ‌రాల‌ను రిలీజ్ చేసింది. సినిమా, క్రీడలతో పాటు పలు విభాగాలలో నెటిజన్లు సెర్చ్‌ చేసినటువంటి వాటిలో టాప్ అంశాలను రిలీజ్ చేసింది. అలా 2023లో అత్యధికంగా సెర్చ్ చేసిన హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
‘మోస్ట్ సెర్చ్డ్ పర్సనాలిటీ ఆఫ్ 2023’ గూగుల్ లిస్ట్‌లో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ అగ్రస్థానంలో నిలిచింది. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే లాంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరోయిన్లను పక్కకు నెట్టాడమే కాకుండా, హాలీవుడ్ లో అగ్ర హీరోయిన్స్ ను కూడా దాటి కియారా టాప్ ప్లేస్ లో నిలిచింది. సిద్దార్థ్ మల్హోత్రాతో పెళ్లి తర్వాత కియారా ‘సత్యప్రేమ్ కీ కథ’ అనే సినిమాలో నటించారు. అయితే ఆ మూవీ అంతగా విజయం సాధించకపోయినా గూగుల్‌లో ఎక్కువ మంది కియారానే వెతికారనే న్యూస్ సెన్సేషన్ గా మారింది.
2023 ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వెతికిన హీరోయిన్ల జాబితాలో కియారా అద్వానీ మరియు  ‘వెడ్నస్ డే’ వెబ్ సిరీస్ ఫేమ్ జెన్నా అర్టేగా అగ్రస్థానంలో నిలిచారు. ఈ టాప్ 10 జాబితాలో దీపిక పదుకొనే, ప్రియాంక చోప్రా, ఆలియా భట్‌ స్థానం పొందకపోవడం అందర్నీ షాక్ గురిచేసింది. వరల్డ్ వైడ్ గా ఉన్న అగ్ర హీరోయిన్లను కాదని, నెటిజన్లు కియారా అద్వానీ గురించి అత్యధికంగా వెతికారనే న్యూస్ కియారా ఫ్యాన్స్ కు చాలా సంతోషం కలిగిస్తోంది.
కియారాకు దక్కిన ఈ ఘనత పై బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసలు తెలుపుతున్నాయి. ఇక కియారా సినిమాల విషయానికి వస్తే, ఆమె ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ సినిమాలలో హీరోయిన్‌గా చేస్తోంది. అందులో ఒకటి శంకర్, రాంచరణ్‌ కాంబోలో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్. మరొకటి హృతిక్ రోషన్‌, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న వార్ 2 మూవీ. మరి కొన్ని ప్రాజెక్ట్ ల చర్చల దశలో ఉన్నాయి.

Ads

Also Read: మన సీరియల్స్ లో మార్పు వస్తే బాగుండును అని మీరు అభిప్రాయపడుతున్నారా ?” అనే ప్రశ్నకి… ఈ నెటిజన్ చెప్పిన సమాధానం చూస్తే నవ్వాపుకోలేరు..!

Previous articleశ్రీలీల విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది.? తప్పేముందని అలా అంటున్నారు.?
Next articleఎవరీ “ప్రణితి షిండే”…రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారమప్పుడు కనిపించిన ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.