Ads
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రేవంత్ రెడ్డి. ఈ పేరు ఏపీ రాజకీయాలలో కూడా ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుపొందారు రేవంత్ రెడ్డి. దీంతో అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీలో అంబరాలు సంబరాలు అంటుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో చాలా సేపు ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వామ్యులు.
మేము పాలకులం కాదు. ప్రజా సేవకులం. ప్రజలు ప్రగతి భవన్ కు రావచ్చుఅని తెలిపారు రేవంత్ రెడ్డి. ప్రజాభవన్ లో ప్రజా పరిపాలన అందిస్తాము. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావచ్చు. కాంగ్రెస్ సమిధిగా మారి తెలంగాణ ఇచ్చింది. అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రసంగం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి ముందుగా మాట ఇచ్చిన ప్రకారం ఆరు గ్యారెంటీల అభయ హస్తం అమలు ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం రజిని అనే దివ్యాంగురాలికి ఉద్యోగాన్ని కల్పిస్తూ సంతకం చేశారు.
Ads
ఇది ఇలా ఉంటే…రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారమప్పుడు తళుక్కున మెరిసింది ఒక అమ్మాయి. ఇప్పుడు అందరి దృష్టి ఆమె మీదే. ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అనే క్యూరియాసిటీ ప్రేక్షకులలో పెరిగిపోయింది. ప్రియాంక రాహుల్ గాంధీల వెనక ఆమె కనపడింది.ఈమె పేరు ప్రణితి షిండే మహారాష్ట్ర సోలాపూర్ సిటీ సెంట్రల్ ఎమ్మెల్యే. మూడుసార్లు ఈమె గెలిచారు. మహారాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. ఈమె వయసు 43 ఏళ్లు.
ఆమె తండ్రి సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ . కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా,మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా కూడా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆయనకి ఉన్న ముగ్గురు ఆడపిల్లలలో ఒకరు ఈ ప్రణితి. సుశీల్ కుమార్ షిండే రాజకీయాలలో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆ రాజకీయ వారసత్వాన్ని అందుకుంది ఈమె.
రేవంత్ రెడ్డి మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ హై కమాండ్ పెద్దలతో పాటుగా ఇరుగుపొరుగు ఉన్న రాష్ట్రాల పార్టీ ముఖ్యలకి కూడా ఆహ్వానాలని పంపించారు. ఈ క్రమంలోనే ఆమె మహారాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ప్రమాణ స్వీకార సభకు హాజరయ్యారు.2014 , 2019 ఎన్నికల్లో ప్రణీతి గెలిచారు.