Ads
కొన్ని సినిమాలు బడ్జెట్ పరంగా చాలా చిన్నవి కానీ అవి సాధించిన సక్సెస్ మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. కలెక్షన్ల పరంగా కాకపోయినప్పటికీ కంటెంట్ పరంగా కొన్ని సినిమాలు ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయి. అలాంటి సినిమాయే ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. అదే రాక్షస కావ్యం.
ఈ సినిమా చిన్న బడ్జెట్ తో వచ్చినప్పటికీ మంచి కంటెంట్ ఉన్న సినిమా. అక్టోబర్ లో విడుదలైన స్ట్రైట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ రాక్షస కావ్యం. ఈ సినిమాలో అభయ్ బేతిగంటి, కుషాలిని, అన్వేష్ మైకెల్, పవన్ రమేష్, దయానంద రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు.
శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దాము రెడ్డి, సింగనమల కళ్యాణ్ నిర్మించారు. ఈ సినిమాలో మన నిజ జీవితంలో వాడే నేటి లాంగ్వేజ్ ని వాడటం వలన ప్రజలు ఓన్ చేసుకున్నారు అలాగే సంగీతం పాటలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. పురాణాల గురించి చెబుతూ సాయికుమార్ వాయిస్ ఓవర్ లో ప్రారంభమయ్యే ఈ సినిమా అంచనాలకు చిక్కకుండా.. మదర్ సెంటిమెంట్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో మైథాలజీని నేటి పరిస్థితులకు అన్వయిస్తూ థ్రిల్లింగ్ గా తీశాడు డైరెక్టర్.
Ads
చదువు అన్నా చదువుకునే వారన్న బాగా ఇష్టం ఉండే అజయ్ ఒక కాంట్రాక్టు కిల్లర్, విలన్లను హైలెట్ చేస్తూ సినిమాలు తీయాలనుకునే వ్యక్తి విజయ్. సినిమాలో వీరిద్దరూ ఎవరు వీరి పాత్రలు ఏమిటి అంటూ వీరిద్దరి చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతుంది. సెకండ్ హాఫ్ కొంచెం తొందరగోళంగా అనిపిస్తుంది. కానీ కామెడీకి,అమ్మ సెంటిమెంట్ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవ్వడంతో ఆ గందరగోళం పెద్దగా హైలైట్ అవ్వలేదు.
మన పురాణాల్లోని క్యారెక్టర్లు ప్రస్తుతం భూమి మీద ఉంటే ఎలా ఉంటుంది అని ప్రయోగాత్మకంగా తీసిన సినిమా ఇది రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉండేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా డిసెంబర్ 15 నుంచి ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ కి తీసుకువస్తున్నారు చిన్న సినిమా తీసి పడేయకండి, అందులో ఉండే థ్రిల్ ని మిస్ అవ్వకండి.
ALSO READ : “శ్రీలీల”ను చూసి ఆ అమ్మే.. ఈ అమ్మగా వచ్చింది.. అంటున్న నెటిజన్స్.! బయోపిక్ కూడా తీయాలంట.?