పేరుకి స్టార్ హీరో.. కానీ పదేళ్లుగా ఒక హిట్ కూడా లేదు! ఎవరో తెలుసా..?

Ads

ఒక నటుడి జీవితంలో హిట్ సినిమాలు ఎలా ఉంటాయో ఫ్లాప్ సినిమాలు కూడా అలాగే ఉంటాయి. అయితే ఫ్లాప్ మూవీస్ ఎక్కువైతే మాత్రం ఆ నటులని ఇండస్ట్రీ ఏమాత్రం పట్టించుకోకుండా నిర్ధాక్షిణ్యంగా వదిలేస్తుంది.

అయితే ఇప్పుడు మనం చెప్పుకునే హీరో మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా ఒక హిట్ కూడా కొట్టలేదు అయినా స్టార్ హీరో స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నాడు.

hero who did not scored hit

అతను మరెవరో కాదు బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్. లండన్ డ్రీమ్స్ సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆదిత్య రాయ్ కపూర్ సినీ ప్రయాణం అంత గొప్పగా ఏమి సాగలేదు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి స్టార్ నటులు ఉన్నప్పటికీ ఎందుకో పెద్దగా హిట్ అవ్వలేదు. తర్వాత అక్షయ్ కుమార్ తో యాక్షన్ రిప్లే, హృతిక్ రోషన్ ఐశ్వర్యరాయ్ లతో గుజారిష్ సినిమాలలో నటించాడు. కానీ ఆ రెండు సినిమాలు కూడా పెద్ద ఫ్లాప్లు మూట కట్టుకున్నాయి.

Ads

hero who did not scored hit

వరుస ఫ్లాప్ లు వస్తున్న సమయంలో 2013 లో వచ్చిన ఆషీకీ 2 సినిమా తొలి సక్సెస్ ని అందించి భారీ విజయాన్ని దక్కించుకుంది. అప్పట్లో ఇది 100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేసిన సినిమా ఇది. ఆ తర్వాత రణబీర్ కపూర్, దీపికా పదుకొణే తో కలిసి ఏ జవాని హే దీవాని సినిమాలో కనిపించాడు ఆదిత్య రాయ్ కపూర్. ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వడంతో అందరూ బాబు గారి జాతకం మారింది అనుకున్నారు.

hero who did not scored hit

కానీ అందరి అంచనాలని తారుమారు చేస్తూ ఆపై వచ్చిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోవడం విశేషం. దావత్ ఏ ఇష్క్, ఓకే జాను, కళాంక్, మలంగ్ చిత్రాలు ఘోర పరాజయాన్ని పొందడం నిజంగా దురదృష్టం. కొస మీరు ఏమిటంటే వెండి తెరమీద అదృష్టం కలిసి రాలేదనుకున్న ఆదిత్య రాయ్ కపూర్ ఓటీటీ రంగంలో అడుగుపెట్టి ది రైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ సిరీస్ మంచి హిట్ అయ్యి అతనికి మంచి పేరు తీసుకు వచ్చింది

Previous article19 ఏళ్ల క్రితం ఆ హీరో పక్కన హీరోయిన్ గా చేసి.. ఇప్పుడు అదే యాక్టర్ కి తల్లిగా రమ్య కృష్ణన్.! ఆ హీరో ఎవరంటే.?
Next articleరాజేంద్ర ప్రసాద్ తో ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు చాలా పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది..! ఎవరో గుర్తు పట్టారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.