Ads
సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకి హిట్లు రావాలని రూల్ లేదు. కొన్ని కొన్ని సార్లు అనుకోని పరిస్థితుల్లో ఒక సినిమా సైన్ చేసి షూటింగ్ కాకముందే ఆ సినిమా వేరొకరి చేతికి వెళ్లిపోయే సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి.
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అయితే కొన్ని హీరోలు సినిమాలు నచ్చక వదిలేయడం ఆ సినిమా ఇంకొక హీరో చేతిలో పడడం అది తీసి హిట్ అవడం లాంటి సంఘటనలు ఈమధ్య జరుగుతున్నాయి.
హీరో గోపీచంద్ కుడా ఇలాంటి విషయమే జరిగింది. మామూలుగా గోపీచంద్ ఈ ఇండస్ట్రీలో ఒక హిట్ సినిమా కోసం ఎంత తపన పడుతున్నాడో అందరికీ తెలిసిందే. సినిమా కెరీర్ని తను ఏనాడో 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టాడు. కెరీర్ స్టార్టింగ్ లో హీరోగా చాలా హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు తర్వాత విలన్ గా నటించి వర్షం లాంటి సినిమాలతో ప్రేక్షకులందరికీ మెప్పించాడు. కానీ ఒకేసారి విలన్ పాత్ర తర్వాత హీరోగా మారడంతో ప్రేక్షకులు ఆ సినిమాలని యాక్సెప్ట్ చేయలేకపోయారు.
Ads
వరుసగా ప్లాపులు మీద ఫ్లాపులు రావడంతో గోపీచంద్ కెరీర్ గ్రాఫ్ అంతా తగ్గిపోతూ వస్తుంది. ఇప్పటికీ కూడా ఒక సరైన హిట్ లేదు గోపీచంద్ కి. సినిమాలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి కానీ ఏవి హిట్ అయ్యే సూచనలు కనిపించేవే కాదు.అసలు సినిమాలు వస్తున్నాయో లేదో అనేటట్టే ఉండేవి. అలాగే ఒక సినిమా గోపీచంద్ చేతికి వచ్చింది. ఆ కథ గోపీచంద్ విన్నాడు. విన్న తర్వాత అది బాక్స్ ఆఫీస్ లో హిట్ అవ్వదు అని ఆ కథని వదిలేసుకున్నారట.
ఆ కథ మరి ఏదో కాదు రానా దగ్గుబాటి, సాయి పల్లవి కలిసి నటించిన విరాటపర్వం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచినా కూడా సాయి పల్లవి, రానా దగ్గుపాటి నటనకు, వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీకు ప్రేక్షకుల దగ్గర గుర్తుండిపోతుంది. ఇందులో పాటలు కూడా మంచి హిట్లనే సంపాదించాయి. అయితే ఈ సినిమాని ముందు గోపీచంద్ కి వినిపించారట. ఇది ఫ్లాప్ అవుతుంది అని ఈ సినిమాని వద్దనుకున్నారట గోపీచంద్.ఈ విషయం రానాకి కూడా తెలుసు. గోపీచంద్ వద్దనుకున్న తర్వాతే తన దగ్గరికి ఈ సినిమా వచ్చింది అని తెలిసి కూడా కథను నమ్మి సినిమా తీశారు కానీ ఇది ఫ్లాప్ గా నిలవడం బాధాకరం.