Ads
తెలంగాణ ఎన్నికల ఫలితాలు బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఎన్నికలకు ముందు చాలా మటుకు సర్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చకపోతే బిఆర్ఎస్ ఓటమి చెందుతుందని తెలిపాయి. అయితే అవేమీ కేసీఆర్ పట్టించుకోకుండా అతి విశ్వాసంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయించారు. ఎన్నికల ఫలితాల్లో చాలా మటుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయి బిఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పులు సీఎం జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకుంటున్నారు.
Ads
త్వరలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుండే సీట్ల పైన దృష్టి సారించారు. ఈసారి చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని చూస్తున్నారు ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలను ప్రకటించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని గంజి చిరంజీవికి ఈసారి టిక్కెట్ కేటాయిస్తున్నట్లుగా తెలిసింది. అందుకే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బయటికి వచ్చేసారు. ఇప్పుడు చాలామందికి నియోజకవర్గాల్లో వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు లేవని వైసిపి నాయకులు వై వి సుబ్బారెడ్డి కూడా తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరిని పిలిపించుకుని మాట్లాడుతున్నారు ఎవరికి సీట్లు దక్కుతయో ఎవరికీ దక్కవో వేచి చూడాలి.