ఒకే ఒక్క ఫోటో… ఈమె కెరీర్‌ని తలకిందులు చేసింది..! దావూద్ ఇబ్రహీంని ప్రేమించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Ads

ఒకప్పుడు కృష్ణ హీరోగా నటించిన సింహాసనం సినిమా ఎంత ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అందులో ఆకాశంలో ఒక తార అంటూ వచ్చిన పాట మరింత ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. అందులో మందాకిని అందాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు ఎవరు ఆమె అందాన్ని అంత తొందరగా మర్చిపోలేరు.

ఆమె అప్పటికే బాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న నటి. 80,90 దశకంలో ఒక వెలుగు వెలిగింది. అలాంటి నటి ఒక ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన దావూద్ ఇబ్రహీం ప్రేమలో పడి తన కెరీర్ ని నాశనం చేసుకుంది. దావూద్ ఇబ్రహీం ముంబై బాంబు పేలుళ్లకు సూత్రధారి.

dawood ibrahim mandakini

టెక్నాలజీ లేని సమయంలోనే తెలివితేటలతో అరాచకాన్ని సృష్టించటంలో ముందుండేవాడు దావూద్ ఇబ్రహీం. బాలీవుడ్ ని తన చేతులలోకి తీసుకొని దర్శకులను నిర్మాతలని అలాగే హీరో హీరోయిన్లను కూడా ఒక ఆట ఆడించేవాడు. ఒకరకంగా చెప్పాలంటే బాలీవుడ్ మొత్తం అతని చేతిలో కీలుబొమ్మగా మారిందని చెప్పాలి. అలాగే బాలీవుడ్ హీరోయిన్లు చాలామంది అతనితో ప్రేమాయణం సాగించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే అందులో ఒకరు మందాకిని. మందాకిని అందానికి పిచ్చెక్కిపోయాడు దావూద్.

Ads

dawood ibrahim mandakini

అలాగే మందాకిని కూడా అతనితో చట్టాపట్టలేసుకొని తిరిగింది. 1994లో దుబాయిలో ఒక క్రికెట్ స్టేడియంలో మందాకిని, దావూద్ కలిసి పక్క పక్కనే కూర్చున్న ఫోటో ఒకటి బయటకు రావడంతో ఈ వార్త మరింత సంచలనం సృష్టించింది. మందాకినికి దావూద్ తో తిరగటం వలన ఆమె కూడా నేర కార్యకలాపాలలో భాగస్తురాలని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది క్రమక్రమంగా మందాకిని కి సినిమా అవకాశాలు సన్నగిల్లాయి.

dawood ibrahim mandakini

తరువాత 1990లో ప్రముఖ వైద్యుడు కాగ్యుర్ రిపోంచే ఠాకూర్ ని వివాహం చేసుకొని దుబాయ్ లోని సెటిలైపోయారు. ఆమెకి ఇనాయ, రబిల్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక దావూద్ ఇబ్రహీం విషయానికి వస్తే అతనిని 2003లోనే మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ గా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి. అతని తలపై ఏకంగా 2.5 కోట్ల డాలర్ల రివార్డు ప్రకటించింది. అయితే తాజాగా అతను విష ప్రయోగానికి గురయ్యాడని కొందరు, చనిపోయాడని కొందరు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని కొందరు చెబుతున్నారు.

Previous article“సలార్” ట్రైలర్ లో శృతిహాసన్ వేసుకున్న ఈ డ్రెస్ గమనించారా.? ఆ సీన్ ని ఇలా లింక్ చేసారు అంటారా.?
Next articleమహిళలకు ఉచిత బస్ ప్రయాణం వల్ల ఆర్టీసీకి లాభాలే అంట…ఎలాగంటే.? కర్ణాటకలో కూడా ఇదే విధంగా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.