అనాధ పిల్లలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న ఈ స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా..? ఎంత గొప్ప మనసు కదా..?

Ads

పవన్ కళ్యాణ్ భార్య అయిన అనా కొణిదెలా ఆదివారం ఒక అనాధ శరణాలయంలో క్రిస్మస్ వేడుకలను అనాధలతో జరుపుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

ఆదివారం ఆమె హైదరాబాద్‌ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్‌ ఫర్‌ ద చిల్డ్రన్‌లోని చిన్నారులతో సరదాగా గడిపారు. వారితో కాసేపు మాట్లాడుతూ విద్య గురించి, డిస్ప్లేన్ గురించి వాళ్లకు చెప్పారట.

ana konidela christmas celebrations

అలాగే వాళ్లకు కావాల్సిన సరుకులు అన్నీ కూడా ఏర్పాటు చేశారట. జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ నిర్వాహకులకు కావలసినవన్నీ ఏర్పాట్లు చేసి పిల్లలకి అన్నీ సమకూర్చేటట్టు చూశారట. పిల్లలతో కొంచెం సేపు మాట్లాడి సరదాగా గడిపి తర్వాత క్రిస్మస్ కేక్ కట్ చేసి వాళ్లతో పాటే క్రిస్మస్ ని గడిపేసారట అనా. ఇదిలా ఉండగా కొణిదెల కుటుంబమంతా ప్రతి క్రిస్మస్ ని కలిపే జరుపుకుంటారు.

ana konidela christmas celebrations

అల్లు అర్జున్ కుటుంబం, చిరంజీవి కుటుంబం, నాగబాబు కుటుంబం, సాయి ధరంతేజ్ కుటుంబం, అందరూ కలిసి ఒకే దగ్గర క్రిస్మస్ వేడుకల్ని జరుపుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ కలిసి క్రిస్మస్ ని జరుపుకున్నారు. అందులో కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు అయిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు కూడా భాగమయ్యారు. ఈ ఫోటోలని ఇంస్టాగ్రామ్ లో సాయిధరమ్ తేజ్ తన అకౌంట్లో పోస్ట్ చేశాడు.

Ads

ana konidela christmas celebrations

కుటుంబ సభ్యులందరూ ఇలా కలిసిమెలిసి క్రిస్మస్ జరుపుకుంటూ ఉండగా ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొనలేకపోవడం విశేషం. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ భార్య అయినా అనా కొణిదల కూడా పాల్గొనకుండా విభిన్నంగా వెళ్లి అనాధ పిల్లలతో క్రిస్మస్ జరుపుకోవడం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈమెని దగ్గర చేస్తుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ సమాజం కోసం ఏమైనా చేద్దాము అని చెప్పి జనసేన పార్టీని స్థాపించి ప్రజలకు సహాయం చేస్తుంటే మరో వైపు తన భార్య అనాధ పిల్లలతో క్రిస్మస్ ని జరుపుకుంటూ సొసైటీలో తన పాత్రను పోషిస్తుంది.

Previous articleYS షర్మిల కూతురిని చూశారా..? అచ్చం తల్లి లాగానే ఉన్నారు కదా..?
Next articleసలార్ సినిమాకి ప్రశాంత్ నీల్ చేసిన పొరపాటు ఇదేనా..? ఇలా చేయకుండా ఉండాల్సింది ఏమో..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.