Ads
సలార్ సినిమా డిసెంబర్ 22న విడుదలై బాక్సాఫీస్ లో ఘన విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే. 250 కోట్లతో నిర్మించిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 400 కోట్లను మించిపోయింది. కానీ ప్రశాంత్ నీల్ చేసిన తప్పేంటో తెలుసా?
ఈ సినిమా నిజానికి సెప్టెంబర్ 28న విడుదల కావాల్సింది ఆ వారమంతా సెలవులు కావడంతో మంచి కలెక్షన్లు వచ్చేవి కానీ VFX కారణాల వల్ల సినిమాని డిసెంబర్ 22 కు పోస్ట్ ఫోన్ చేశారు.
అయితే అదే సమయంలో షారుక్ ఖాన్ నటిస్తున్న డంకీ సినిమా విడుదల కావడంతో నార్త్ లో ఈ సినిమాలు రెండిటికి క్లాష్ వచ్చేసింది. అక్కడ షారుక్ ఖాన్ సినిమా కావడంతో థియేటర్లన్నీ ఆ సినిమానే కొనుక్కున్నాయి. అక్కడ మల్టీప్లెక్స్ దగ్గర కూడా సలార్ సినిమాకి ఇబ్బందులే వచ్చాయి. ఈ వీకెండ్ లో 50 కోట్లు పూర్తి చేద్దాం అనుకొని లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లకి నార్త్ లో 35 కోట్ల వరకు మొదటి రోజు వచ్చాయి. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లు వరకు సంపాదించింది సలార్ మూవీ.
Ads
కానీ ఇదే సెప్టెంబర్ లోనే విడుదల చేసి ఉంటే ఈపాటికి ఏ క్లాష్ లేకుండా సులువుగా 200 కోట్లను దాటేసేది ఈ సినిమా. కర్ణాటక తమిళనాడు, హైదరాబాదులో కూడా కొన్ని థియేటర్లు డుంకిని కొనుక్కున్నాయి. అందువల్లనే సలార్ కలెక్షన్లకు డంకీ అడ్డుగా వస్తుంది. ఏ క్లాష్ లేకుండా విడుదల చేసి ఉంటే కచ్చితంగా ఇప్పుడు ఉన్న కలెక్షన్లు కన్నా ఎక్కువే ఉండేది ఈ సినిమా. మరోవైపు డుంకి కూడా నార్త్ లో కలెక్షన్లు బానే సంపాదిస్తుంది. ఇప్పటికే 150 కోట్లు దాటేసింది ఏ క్లాష్ లేకపోయి ఉంటే అవి కూడా సలార్ అకౌంట్లోకి వచ్చేవేమో!
సలార్ సినిమా నిజానికి ఏప్రిల్ లో రావాల్సింది. దాన్ని సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ చేసి మళ్ళీ డిసెంబర్ చేశారు. ఈ VFX కారణాలన్నీ ముందే చూసుకొని సినిమాని ప్రీపోన్ చేసుకోనో లేకపోతే ఏ సినిమాతో క్లాష్ లేకుండా ఉండేటట్టు ఒక విభిన్నమైన రిలీజ్ డేట్ ని ఎంచుకున్నట్టయితే మంచి కలెక్షన్లు వచ్చేవి. అయినప్పటికీ ప్రభాస్ సినిమా అంటేనే కలెక్షన్లు వర్షం ముంచుకు వస్తుంది. ఇప్పటికి కూడా ఏమీ తక్కువ లేదు కలెక్షన్ల సునామీ సలార్ కి వస్తూనే ఉంది వెయ్యి కోట్లు దాటేస్తుంది అని విశ్లేషకులు చెప్తున్నారు.