సలార్ లో దేవా పాత్ర కోసం ముందుగా అనుకున్న హీరో ఎవరో తెలుసా..? మరి ప్రభాస్ తో ఎందుకు చేయాల్సి వచ్చింది..?

Ads

డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది సలార్. రిలీజ్ అయిన ప్రతి చోట హిట్ టాక్ ని సొంతం చేసుకుని చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది.

డైనోసార్ వేటాడితే ఇలాగే ఉంటది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మీసాలు మెలేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కూడా ఒక రేంజ్ లో ఉంది. ప్రపంచం మొత్తం సలార్ గురించి మాట్లాడుకునేటట్టు చేసాడు డైరెక్టర్.

అయితే సలార్ గురించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే సలార్ సినిమాలో దేవా క్యారెక్టర్ కోసం డైరెక్టర్ ముందుగా ప్రభాస్ ని అనుకోలేదంట, ఈ పాత్రని తమిళ హీరో సూర్య ని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాడంట ప్రశాంత్.

Ads

అయితే కథ గురించి డిస్కషన్ జరుగుతున్న సమయంలో దేవా పాత్రకు ప్రభాస్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సూచించడంతో ఆలోచనలో పడ్డాడట ప్రశాంత్. ఎందుకంటే సినిమా కంటెంట్ పరంగా హీరోకి చాలా బలమైన శక్తి, బలమైన కటౌట్ ఉండాలి ప్రభాస్ అయితే ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అని ప్రశాంత్ నీల్ కూడా భావించి వెంటనే ప్రభాస్ ని కలిసి స్టోరీని వివరించాడు.

అప్పటికే కేజిఎఫ్ డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ మంచి ఫామ్ లో ఉన్నాడు అలాగే అతను చెప్పిన కథ కూడా ప్రభాస్ కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ విధంగా వారిద్దరి కాంబినేషన్లో సలార్ మూవీ పట్టాల మీదకి ఎక్కింది ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతుంది. ఏ మాటకామాటే చెప్పుకోవాలంటే నిజంగా ఈ సినిమాకి సూర్య కంటే ప్రభాస్ కటౌటే కరెక్టుగా ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.

Previous articleఅందరి దృష్టిని ఆకర్షిస్తోన్న నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’.. భారీ అంచనాలతో డిసెంబర్ 29న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధం
Next article“యానిమల్” సినిమాలో నర్సు పాత్రలో నటించిన ఈమె గురించి తెలుసా…?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.