రెస్టారెంట్ కి వెళ్లి ఇలా ఎవరైనా చేస్తారా.? “జల్సా” సినిమాలో ఈ సీన్ గమనించారా.?

Ads

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం జల్సా. బంగారం సినిమా షూటింగ్ టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ చెప్పినప్పుడు విపరీతంగా నచ్చటంతో ఈ సినిమాకి ఓకే చెప్పాడంట పవన్ కళ్యాణ్. గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది ఇలియానా పార్వతీ మిల్టన్ ల అందం బ్రహ్మానందం, సునీల్, అలీ హాస్యం ముఖేష్ రిషి విలనిజం ప్రేక్షకులని విపరీతంగా అలరించాయి.

ఈ సినిమాలో ఎంతో సూపర్ హిట్ అయినా గాల్లో తేలినట్టుందే పాట ఆ రోజుల్లోనే కోటి రూపాయలు బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాని పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు ప్రీ రిలీజ్ చేయాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇందులో ఒక సీన్ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ అవుతుంది. ఆ సీన్ తో చాలా మంది రీల్స్ చేస్తున్నారు, అలాగే మీమ్స్ కూడా చేస్తున్నారు. అంతగా వైరల్ అవుతున్న ఆసిన్ ఏమిటంటే ఇలియానా, శివాజీ ఇద్దరూ హోటల్లో కలిసి మాట్లాడుకుంటారు.

Ads

అయితే శివాజీకి సడన్ గా ఎలర్జీకి గురవుతాడు. ఇలియానా ఒక్కసారిగా షాక్ అవుతూ మీకు ఏమైనా అలర్జీస్ ఉన్నాయా అని అడుగుతుంది. నాకు పొట్లకాయ అంటే పడదు అలర్జీ అంటాడు శివాజీ. మీరు ఇప్పుడు తింటున్నది పొట్లకాయే అని చెప్తుంది ఇలియానా. స్కిన్ రాషెస్ ఎక్కువైపోయి కింద పడిపోతాడు శివాజీ. ఇది చూసిన నెటిజెన్స్ ఆ సీన్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు.

హోటల్ కి వెళ్లి ఎవరైనా పొట్లకాయ ఆర్డర్ ఇస్తారా అని కొందరు, నేనైతే బిర్యానీ కాకుండా వేరే ఏమీ ఆర్డర్ ఇవ్వను అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనాప్పటికీ రిలీజ్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ సినిమాలో సీన్స్ ట్రెండింగ్ అవ్వడం అనేది పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రమే చెల్లింది అంటూ మీసాలు మెలేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఎంతైనా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ కి ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది మరి.

Previous articleకన్నడలో “సలార్” వెనకబడడానికి కారణం ఇదేనా.? “ప్రశాంత్ నీల్” తెలిసే ఇలా చేసారా.?
Next article2023 లో టాలీవుడ్ లో అడుగుపెట్టి… మొదటి సినిమాతోనే ఫ్లాప్ అందుకున్న 7 హీరోయిన్స్ వీళ్ళే.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.