Ads
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటించి, దర్శకత్వం వహించిన సినిమా కీడాకోల. సస్పెన్స్ కామెడీ ఎంటర్టైన్గా రూపొందించిన ఈ చిత్రానికి ఆరంభంలో మంచి టాక్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మొదటి రెండు రోజులు మంచి స్పందన లభించింది. ఆ తరువాత మాత్రం ఆశించినంత స్పందన రాబట్ట లేకపోయింది ఈ సినిమా. దాంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ని కూడా చేరుకోలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ ముందు యావరేజ్ గా మిగిలిపోయింది.
ఈ చిత్రాన్ని సాయి కృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, భరత్ కుమార్, శ్రీపాదనందిరాజ్ లు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం, హరికాంత్, చైతన్యరావు, విష్ణు, జీవన్ కుమార్ తదితరులు నటించారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మామూలుగా అయితే క్రైమ్ కామెడీ తో వచ్చే సినిమాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రీతిలో స్పందన లభిస్తూ ఉంటుంది.
Ads
అందుకే ఇలాంటి సినిమాలు చేసేటందుకు చాలా మంది దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. తరుణ్ భాస్కర్ కూడా ఆ ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాడు. కానీ ఎందుకో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఇక ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ స్క్రీనింగ్ హక్కులను సంబంధించి మంచి పోటీనే వచ్చింది ఈ పరిస్థితులలో తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ హక్కులను సొంతం చేసుకుంది. సదరు నిర్మాతలకు మంచి మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా కోసం ఓటీటీ ప్రియులు తెగ ఎదురుచూస్తున్నారు.
క్రైమ్ కామెడీ కాన్సెప్ట్ రూపొందించిన కీడాకోలా మూవీని డిసెంబర్ 29 నుంచి అహలో స్ట్రీమింగ్ చేసేందుకు చేస్తున్నట్లు ఆహా ప్రకటించింది. మామూలుగా అయితే ఈరోజే ఈ సినిమా ఓటీటీ లో వస్తుంది. అయితే గోల్డ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. సాధారణ ప్రేక్షకులకు మాత్రం డిసెంబర్ 29 నుంచి ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది.