Ads
మొదటి నుండి సినీపరిశ్రమ అంటేనే ఒకరిని పెళ్లి చేసుకున్నాక, నచ్చకపోతే వారి నుండి విడిపోయి మరోకరిని పెళ్లి చేసుకోవడం సర్వ సాధారణం అన్నట్టు చూస్తారు.
అలా అనుకోవడానికి కారణం లేకపోలేదు. విడపోయి ఇంకోకరిని చేసుకున్న వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అలాగే ఒకరిని వివాహం చేసుకున్న తరువాత అతను మరణించడంతో మళ్ళీ వివాహం చేసుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు.కానీ భర్త మరణించిన తరువాత, వారికి వివాహం చేసుకునే వయసు, అవకాశం ఉన్నప్పటికీ భర్త జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్న సినీతారల గురించి తెలుసుకుందాం రండి..#1.రోహిణి
సీనియర్ నటి రోహిణి రఘువరన్ తో విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. అయితే తాము మళ్ళీ కలుస్తామని ఆశించింది. అయితే రఘువరన్ చనిపోవడం జరిగింది. ఆ తరువాత కూడా రోహిణి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది.
Ads
#2.రాగిణి
రాగిణి సినిమాలు, సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ పేరు తెచ్చుకుంది. వివాహం జరిగిన కొద్దికాలంలోనే రాగిణి భర్త చనిపోయారని సమాచారం. ఇక రాగిణి అప్పటి నుండి వివాహం చేసుకోకుండా ఉన్నట్టు తెలుస్తోంది.
#3.డిస్కో శాంతి
డిస్కో శాంతి తెలుగు సినిపరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న డిస్కో శాంతి. ఆ తరువాత హీరో శ్రీహరిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. కానీ ఆయన హఠాత్తుగా మరణించారు. అప్పటి నుండి డిస్కో శాంతి శ్రీహరి జ్ఞాపకాలతో గడుపుతోంది.
#4.సురేఖ వాణి
సురేఖ వాణి పరిచయం అక్కరలేని పేరు. ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఇక ఆమె టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రల్లో నటించింది. 2019లో సురేఖ వాణి భర్త సురేష్ తేజ మరణించారు. మళ్ళీ పెళ్లి చేసుకోకుండా భర్త జ్ఞాపకాలతో కూతురిని చూసుకుంటూ జీవిస్తోంది.
#5.ఉదయ్ కిరణ్ భార్య విషిత
లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో ఉదయ్ కిరణ్ 2014లో చనిపోయారు. అప్పటికే ఆయనకు పెళ్లి అయ్యి, భార్య విషిత ఉంది. ఉదయ్ కిరణ్ చనిపోయిన తరువాత విషిత మళ్ళీ పెళ్లి చేసుకోకుండా చెన్నైలో జాబ్ చేస్తూ జీవిస్తోంది.
#6. మీనా
ఈమధ్య కాలంలోనే హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించారు. ఆ తరువాత మీనా తన కూతురిని చూసుకుంటూ గడుపుతోంది. కానీ మీనా ఎవరినో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే మీనా ఆ వార్తలను ఖండించి, అలాంటి ఉద్దేశం తనకు లేదని చెప్పింది.Also Read: భార్యాభర్తలుగా మరియు బ్రదర్, సిస్టర్ గా నటించిన 10 జంటలు ఇవే..!