ఎక్కువగా భూకంపాలు “జపాన్” లోనే ఎందుకు వస్తాయి..? కారణం ఇదేనా..?

Ads

జపాన్‌లో నూతన సంవత్సరపు రోజున భారీ భూకంపం సంభవించింది. వాతావరణ శాఖ సునామీ హెచ్చరిక సైతం జారీచేసింది. ఈ భూకంపాలతో న్యూ ఇయర్ వేడుకల్లో ఉన్న జపాన్ దేశస్తులు ఒక్కసారిగా  భయాందోళనలకు గురి అయ్యారు.

Ads

జపాన్‌లో సోమవారం నాడు 7.6 తీవ్రతతో తీవ్ర భూకంపం సంభవించింది. ఐదు గంటల వ్యవధిలో యాబై సార్లు భూమి కంపించడంతో ప్రజలు హడలిపోయారు. అక్కడ తరచూగా భూకంపాలు సంభవిస్తుంటాయి. జపాన్ లోనే ఎక్కువగా భూకంపాలు రావడానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కొత్త ఏడాది 2024 లో అడుగు పెట్టిన రోజే జపాన్‌ దేశం వరస భూకంపాలకు గురి అయ్యింది. ఒకదాని వెంట మరొక భూకంపాలతో ఆ దేశ ప్రజలకు న్యూ ఇయర్ ప్రారంభమైంది. 18 గంటలలో ఏకంగా 155 సార్లు భూమి కంపించడంతో ఆ దేశ ప్రజలు భయాందోళనలకు గురి అయ్యారు. 7.6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో, సునామీ కూడా వచ్చే ప్రమాదం ఉందని జపాన్ వాతావరణ శాఖ ముందస్తుగా  హెచ్చరికలు చేశారు. ఇప్పటి వరకు 48 మంది చనిపోయినట్లుగా ప్రకటించారు. ప్రజలను తీర ప్రాంతాల నుండి తరలిస్తున్నారు.
ప్రపంచంలో అత్యంత భూకంప సంభవించే ప్రాంతాలలో ఒకటైన జపాన్‌లో భూకంపాలు రావడం  సర్వసాధారణం. ప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అనే ప్రాంతంలో ఈ ద్వీప దేశం ఉండటం వల్లే అక్కడ ఎక్కువగా భూకంపాలు సంభవిస్తాయి. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటే పసిఫిక్ మహాసముద్రంలో అత్యధికంగా అగ్నిపర్వతాలు మరియు తరచు భూకంపాలు సంభవించే ప్రాంతం.
శాస్త్రవేత్తల చెబుతున్న దాని ప్రకారం, అగ్నిపర్వతాలు మరియు భూకంపాలు చాలావరకు “రింగ్ ఆఫ్ ఫైర్” చుట్టే జరుగుతాయి. ఈ ప్రత్యేక లక్షణం వల్ల ప్రపంచంలో సగటున అరు లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాలలో 20 శాతం భూకంపాలు జపాన్‌ లో సంభవిస్తాయి. వాస్తవంగా ఆ దేశంలో ప్రతి 5 నిమిషాలకు భూమి కంపించడం జరుగుతుంది. కొన్నిసార్లు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు భారీ సునామీలకు కూడా దారి తీస్తుంది.

Also Read: OLD PETROL BILL: 1963 నాటి పెట్రోల్ బిల్.. ఐదు లీటర్ల కి ఎంత అయిందో చూడండి!

Previous article“జయం” సినిమాలో సదా చెల్లి గుర్తుందా.? ఆ అమ్మాయి ఇప్పుడెలా ఉందో..ఏం చేస్తుందో తెలుసా?
Next articleఆర్జీవితో న్యూ ఇయర్ వేడుకల్లో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.