“దేవర” మూవీలో “శ్రీకాంత్” ఏ పాత్రలో నటిస్తున్నారంటే..?

Ads

స్టార్ హీరోలు నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడానికి అటు ఆ హీరో అభిమానులే, కాకుండా ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తమ అభిమాన హీరో మూవీ అప్డేట్లు ఇవ్వాలని ఫ్యాన్స్ కూడా ఇటీవల కాలంలో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ తెరకెక్కుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత ఎన్టీఆర్ నుండి రాబోతోన్న సినిమా కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో శ్రీకాంత్ నటిస్తున్నారు. తాజాగా ఆయన పాత్ర గురించి ఓ నటుడు బయటపెట్టాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కొన్నిరోజుల నుండి శరవేగంగా జరుపుకుంది. ఈ మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ కావడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఇప్పటికే సినిమా పై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక ఈ మూవీ కూడా రెండు పార్ట్ లుగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ మూవీలో సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ఈ మూవీ గురించి అందులో నటించిన ఒక యాక్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో సీక్రెట్ విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా శ్రీకాంత్ పాత్ర గురించి బయటపెట్టాడు. ఆ నటుడు మాట్లాడుతూ శ్రీకాంత్ క్యారెక్టర్ కి దగ్గర ఉండే పాత్రలో నటించినట్టు తెలిపారు. శ్రీకాంత్ క్యారెక్టర్ గురించి యాంకర్ అడుగగా , జాన్వీ కపూర్ కి తండ్రిగా శ్రీకాంత్ నటిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందని వెల్లడించారు.
అది మాత్రమే కాకుండా ఎన్టీఆర్ నటన గురించి తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో పై కొందరు నెటిజెన్లు ‘ఎవరైనా ఆపండి రా బాబు, లేకపోతే  స్టోరీ మొత్తం చెప్పేసే లా ఉన్నాడు’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Ads

Previous article“హిట్ అండ్ రన్” చట్టం అంటే ఏమిటి..? దేశవ్యాప్తంగా డ్రైవర్లు ఎందుకు ఆందోళన చేస్తున్నారు..?
Next article33 కోట్ల బడ్జెట్…కానీ 50 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి..! 2023లోనే అత్యంత డిజాస్టర్ సినిమా ఇదే.!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.