ఆఫర్స్ రావట్లేదంటూ “మణిశర్మ” ఆవేదనలో నిజముంది…కానీ ఈ విషయం ఒకసారి ఆలోచించండి.!

Ads

మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు అన్నీంటికి ఆయనే సంగీతాన్ని అందించేవారు. కొన్నేళ్ళ పాటు మణిశర్మ ప్రభంజనం కొనసాగింది. స్టార్ హీరోలు అందరికీ కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన ఖ్యాతి మణిశర్మదే.

కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసమే థియేటర్లకు క్యూ కట్టే ఫ్యాన్స్ లక్షల్లో ఉండేవారంటే ఆయన రేంజ్ ఏమిటో అర్దం అవుతుంది. అయితే కొన్నేళ్ళ నుండి అంతా మారిపోయింది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ల ఎంట్రీతో మణిశర్మ వెనుకబడ్డారు. ఫ్లాపులు రావడంతో మణిశర్మ కెరీర్ లో గ్యాప్ వచ్చింది.

ఇస్మార్ట్ శంకర్ తో మంచి కంబ్యాక్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు వరుసగా డిజాస్టర్లు కావడంతో ఆయనను మళ్ళీ వెనక్కు నెట్టాయి. ప్రస్తుతం మణిశర్మ చేతిలో డబుల్ ఇస్మార్ట్ మూవీ ఉంది. ఆయన ఆ మూవీ పైనే ఆశలు పెట్టుకున్నారు. మణిశర్మ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తం చేశారు. స్టార్ హీరోలు తనను దూరం పెట్టారని, ఆఫర్లు అన్ని తనకు మాత్రమే ఇవ్వాలని ఆశించడం లేదని అన్నారు.

Ads

తమన్, దేవి శ్రీ లకు ఎన్ని ఆఫర్లు ఇచ్చిన కూడా రొటేషన్ ప్రాసెస్ లో తనకు కూడా ఒక అవకాశం ఆశించడం తప్పు కాదన్నట్టుగా మాట్లాడారు. మణిశర్మ పవన్ కల్యాణ్‌, మహేష్ బాబులకు పలు మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు. వారి గురించి మాట్లాడుతూ, మహేష్ బాబుతో స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది. తనపై ఎవరు ఏం చెప్పారో కానీ, ఆ బంధం ప్రస్తుతం లేదని అన్నారు. ఇక పవన్ గురించి మాట్లాడుతూ, పవన్ తో మంచి బంధం ఉండేదని, సాంగ్స్ కంపోజింగ్ లో ఇద్దరం కలిసి డాన్స్ చేశామని, అయితే ప్రస్తుతం కలవడం అరుదుగా మారిందని ఫీలయ్యారు.
మహేష్, పవన్ వంటి హీరోలు మ్యూజిక్ డైరెక్టర్లందరికి ఛాన్స్ ఇవ్వాలని మణిశర్మ కోరారు. అయితే మణిశర్మకు మెగాస్టార్ చిరంజీవి ఆచార్యకు, సమంత శాకుంతలం మూవీకి, సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్, గోపీచంద్ సీటిమార్ వంటి సినిమాలలో ఛాన్స్ వచ్చినా మణిశర్మ తన మ్యాజిక్ ను చూపించలేకపోయారు. వాటిలో ఒకటి రెండు సాంగ్ మాత్రమే ఆకట్టుకున్నాయి. ఆఫర్లు ఇచ్చినా  ప్రూవ్ చేసుకోకపోతే ఎలా అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: అందంలో హీరోయిన్లతో పోటీపడేలా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆ స్టార్ హీరో కూతురు.!

Previous articleకాంగ్రెస్‌లో షర్మిల చేరిన సమయంలో చోటు చేసుకున్న ఘటన…బ్రదర్ అనిల్ ఏం చేసారు అంటే.?
Next article“నా సామిరంగ” లో అల్లరి నరేష్ కి జోడిగా నటించే ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.